Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?

బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతటి ఆదరణ ఉందో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెరపై 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా..

Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?

Bigg Boss Nonstop

Updated On : May 20, 2022 / 7:31 AM IST

Bigg Boss Nonstop: బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతటి ఆదరణ ఉందో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెరపై 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. 17 మంది కంటెస్టెంట్ లతో 12 వారాల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం ఈ వారంతో ముగియనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు.

Bigg Boss Nonstop: ఫైనల్‌కు చేరిన బిగ్‌బాస్.. ఈ సీజన్ విన్నర్ ఎవరో?

అఖిల్, అనిల్, బాబా భాస్కర్, అరియనా, బిందు మాధవి, మిత్రశర్మ, శివ ఉన్నారు. గతంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో మామూలుగా ఐదు మంది మాత్రమే కంటెస్టెంట్ లో ఉండగా ఈసారి ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. వీరిలో టైటిల్‌ ఎవరి సొంతం అవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈసారి బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ విన్నర్ కాబోతుందని.. ఆడపులి బిందు మాధవి ఈ సీజన్ టైటిల్ గెలుచుకోబోతుందని ప్రచారం జరుగుతుంది.

Bigg Boss: బిగ్ బాస్ ఆగిపోతుందా? నిర్వాహకులకు షాక్ తప్పదా?

బిగ్ బాస్ టైటిల్ రేసులో బిందు మాధవి, అఖిల్ ఉండగా.. వీరిద్దరిలో ఎవరు టైటిల్ గెలుస్తారని పెద్ద ఎత్తున చర్చలు మొదలు పెట్టారు. అయితే, బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కావడంతో బిగ్ బాస్ టైటిల్ ను బిందుమాధవి అందుకుందని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా #BinduTheSensation, #BinduMadhavi అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే!