Shobha Shetty : బిగ్‌బాస్ సీజన్ 7లో ఎనిమిదవ కంటెస్టెంట్.. శోభా శెట్టి.. కార్తీకదీపం మోనితగా ఫేమ్ తెచ్చుకొని..

సీరియల్ నటి శోభా శెట్టి.. అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ కార్తీకదీపం మోనిత(Monitha) అంటే ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా గుర్తుపట్టేస్తారు.

Shobha Shetty : బిగ్‌బాస్ సీజన్ 7లో ఎనిమిదవ కంటెస్టెంట్.. శోభా శెట్టి.. కార్తీకదీపం మోనితగా ఫేమ్ తెచ్చుకొని..

Bigg Boss Season 7 Eighth Contestant Karthika Deepam Fame Shobha Shetty Details

Shobha Shetty :  తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.

ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో ఎనిమిదవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి, కార్తీకదీపం(Karthika Deepam) ఫేమ్ శోభా శెట్టి(Shobha Shetty) ఎంట్రీ ఇచ్చింది.

సీరియల్ నటి శోభా శెట్టి.. అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ కార్తీకదీపం మోనిత(Monitha) అంటే ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా గుర్తుపట్టేస్తారు. కన్నడ భామ అయిన శోభా శెట్టి కన్నడలో పలు సీరియల్స్ తో మెప్పించి, పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తెలుగులో అవకాశాలు తెచ్చుకుంది. తెలుగు సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. కార్తీక దీపం సీరియల్ శోభా శెట్టి లైఫ్ నే మార్చేసింది. ఈ సీరియల్ లో విలన్ క్యారెక్టర్ లో మోనిత పాత్రలో నటించిన శోభా ఆ పాత్రతోనే అందరికి గుర్తుండిపోయింది.

Aata Sandeep : బిగ్‌బాస్ సీజన్ 7లో ఏడవ కంటెస్టెంట్.. ఆట సందీప్.. డ్యాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ గా ప్రయాణం..

ఇక సోషల్ మీడియాలో తన అందాలని ఆరబోస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంది. సీరియల్స్ తో అటు ఫ్యామిలీ ఆడియన్స్, సోషల్ మీడియాతో ఇటు యూత్ ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది శోభా. మరి బిగ్ బాస్ ఫేమ్ తో ఈ అమ్మడికి మరింత స్టార్ డమ్, సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి.