Bigg Boss 7 Telugu : అతడు సేఫ్..! మిగిలిన అందరూ నామినేషన్స్‌లోనే..!
Bigg Boss Telugu 7 Day 85 Promo : 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను బిగ్‌బాస్ మొదలుపెట్టేశాడు. ఇందుకు సంబంధించిన ప్రొమో వచ్చేసింది.

Bigg Boss Telugu 7 Day 85 Promo
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఆఖరి దశకు చేరుకుంది. 12 వారాలు పూర్తి అయ్యాయి. ఎనిమిది మంది హౌస్‌లో మిగిలారు. వీరిలో టాప్-5కి ఎవరు చేరుకుంటారు. ఏ ముగ్గురు ఎలిమినేట్ కానున్నారు అన్న విషయాలు ఆసక్తికరంగా మారింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో అశ్వినీ ఎలిమినేట్ కాగా ఆదివారం నాటి ఎపిసోడ్‌లో రతికను ఇంటి నుంచి బయటకు పంపించి వేశారు. ఎవిక్షన్ ప్రీ పాస్ వాడే ఛాన్స్ ఉన్నప్పటికీ రతికను సేవ్ చేసేందుకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఇష్టపడలేదు. దీంతో రతిక ఎలిమినేట్ అయ్యింది.
ఇక 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను బిగ్‌బాస్ మొదలుపెట్టేశాడు. ఇందుకు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. తాము నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఇంటి సభ్యుల ముఖాలపై పెయింట్ వేయాలని బిగ్‌బాస్ సూచించాడు. నా గేమ్ చూసి నన్ను ప్రోత్సహించారు. అయితే.. అంతకంటే ఎక్కువగా నన్ను నెగెటివ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారంటూ శివాజీని ప్రియాంక నామినేట్ చేసింది. ప్రియాంకతో పాటు అర్జున్, గౌతమ్‌లు కూడా శివాజీని నామినేట్ చేశారు.
ఇలా ఒక్కొక్కరు మిగిలిన వారిని నామినేట్ చేసుకున్నారు. అయితే.. అమర్ దీప్‌ను మాత్రం ఎవ్వరూ నామినేట్ చేయలేదు. అతడు మినహా మిగిలిన అందరూ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. ఎవరిని ఏ కారణంతో నామినేట్ చేశారో తెలియాలంటూ పూర్తి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయకతప్పదు.