Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది.. అందరూ అమ్మాయిలు రాధికా లాంటివారు..
'టిల్లు స్క్వేర్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. రాధిక రింగులు జుట్టుకి పడిపోయానంటూ టిల్లు గాడు ప్రేమగోలతో..

Radhika Song released from Anupama Parameswaran Siddu Jonnalagadda Tillu Square
Tillu Square : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కథని, డైలాగ్స్ అందిస్తూ నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘డీజే టిల్లు’. ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ఈ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ ని తీసుకు వచ్చేందుకు సిద్దమైన మేకర్స్ ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా సిద్ధునే కథని, డైలాగ్స్ ని రాస్తున్నారు. ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ టిల్లుకి జోడిగా నటిస్తున్నారు. మల్లిక్ రామ్ ఈ సీక్వెల్ కి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన మూవీ టీం సాంగ్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ‘టికెటే కొనకుండా’ అనే మొదటి సాంగ్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా సెకండ్ సాంగ్ ని విడుదల చేశారు. రాధిక రింగులు జుట్టుకి పడిపోయానంటూ.. టిల్లు ప్రేమగోలతో ఈ సాంగ్ సాగుతుంది. రామ్ మిరియాల సంగీతం అందించిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా, రామ్ మిరియాల పాటని పాడారు. ఫస్ట్ సాంగ్ లాగానే పాటకి ముందు ఒక సీన్ కూడా చూపించారు. అమ్మాయిలు అందరూ రాధికా లాంటివారు. రాధికా ఇన్‌స్టిట్యూషన్ లో డిగ్రీ చేసి, టిల్లు గాడు లాంటి వాడిని ఆడుకుంటాకి బయటకి వస్తారు. దేవదాసు పార్వతి, లైలా మజ్ను ప్రేమ కథల్లో ఇద్దరు బాధ పడతారు. కానీ టిల్లు రాధికా కథలో నేను మాత్రమే సఫర్ అవుతాను అంటూ టిల్లు చెప్పుకొచ్చాడు.
Also read : Harom Hara Teaser : సుధీర్ బాబు పాన్ ఇండియా మూవీ కోసం ప్రభాస్.. ‘హరోంహర’ టీజర్ రిలీజ్..
కాగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టిల్లు 1కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సీక్వెల్ ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. ఇక ఈ సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వచ్చే ఏడాదికి పోస్టుపోన్ అయ్యింది. 2024 ఫిబ్రవరి 9న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మొదటి పార్ట్ తో 30 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న టిల్లు గాడు.. ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.