Bigg Boss 7 Telugu : శివాజీకి నాగార్జున పంచ్‌.. అమ‌ర్‌దీప్ బ్లాక్‌మెయిల్ చేశాడా..?

Bigg Boss Telugu 7 Day 90 Promo : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో 13వ వారం పూర్తి కావొస్తుంది

Bigg Boss 7 Telugu : శివాజీకి నాగార్జున పంచ్‌.. అమ‌ర్‌దీప్ బ్లాక్‌మెయిల్ చేశాడా..?

Bigg Boss Telugu 7 Day 90 Promo

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో 13వ వారం పూర్తి కావొస్తుంది. శ‌నివారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రొమోను విడుద‌ల చేశారు. వారానికి సంబంధించి కంటెస్టెంట్ల ఆట‌తీరుకు నాగార్జున రివ్యూ ఇచ్చారు. కొంద‌రికి గ‌ట్టిగానే పంచుకులు ఇచ్చారు. బిగ్‌బాస్ సీజ‌న్ 7 మొద‌టి ఫైన‌లిస్ట్‌గా నిలిచిన అర్జున్‌కు నాగ్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. టికెట్ టూ ఫినాలే రేసులో ఆరంభంలోనే శివాజీ, శోభాశెట్టిలు ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే.

దీనిపై వారిద్ద‌రిని నాగార్జున ప్ర‌శ్నించారు. 100 శాతం ఇచ్చావా అని నాగార్జున అడ‌గ‌గా 200 శాతం ఇచ్చా అంటూ శోభాశెట్టి అనింది. మ‌రీ అంత‌లా ఆడితే ఎందుకు ఇంత చివ‌ర‌లో ఉన్నావ్ అంటూ నాగ్ అన్నారు. చేయి బాగా ఇబ్బంది పెట్టింది అని శివాజీ అన‌గా రాడ్ గేమ్ అనేది చేతితో ఆడిన గేమ్ కాదు గ‌దా కాలితో ఆడింది గ‌దా అంటూ కింగ్ పంచ్ వేశాడు.

Sheela Rajkumar : విడాకులు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

అమ‌ర్‌దీప్ కు శివాజీ, శోభా లు పాయింట్లు ఎందుకు ఇచ్చారో కార‌ణం చెప్పాల‌ని నాగార్జున అడిగాడు. మాట ఇచ్చాం అందుకే ఇచ్చేశామ‌ని చెప్పారు. ఆ త‌రువాత‌.. నువ్వు గేమ్‌లో ఓడిపోవ‌డానికి కార‌ణం ఏంటి అని ప్రియాంక‌ను నాగార్జున అడుగ‌గా సంచాల‌కులు పెట్టిన రూల్ కార‌ణం అని చెప్పింది. పాయింట్ల‌ను అమ‌ర్‌కు ఇవ్వ‌కుండా గౌత‌మ్‌కు ఎందుకు ఇచ్చావు అని ప్రియాంక‌ను నాగ్ అడిగారు. మొత్తంగా ప్రొమో అదిరిపోయింది.