BiggBoss 6 Day 38 : కొనసాగుతున్న ఎమోషనల్ టాస్క్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..

బిగ్‌‌బాస్‌ లో ఆరోవారం కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతుంది. ఈ సారి ఎమోషనల్ టాస్క్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ కి బ్యాటరీ ఛార్జ్ ఇచ్చి వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చి ఛార్జింగ్ తగ్గేలా చేయడం, ఈ టాస్క్ మొత్తం ఎమోషనల్ గా తీసుకెళ్తున్నాడు బిగ్‌‌బాస్‌............

BiggBoss 6 Day 38 : కొనసాగుతున్న ఎమోషనల్ టాస్క్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..

BiggBoss 6 Day 38 emotional task running

Updated On : October 13, 2022 / 6:38 AM IST

BiggBoss 6 Day 38 :  బిగ్‌‌బాస్‌ లో ఆరోవారం కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతుంది. ఈ సారి ఎమోషనల్ టాస్క్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ కి బ్యాటరీ ఛార్జ్ ఇచ్చి వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చి ఛార్జింగ్ తగ్గేలా చేయడం, ఈ టాస్క్ మొత్తం ఎమోషనల్ గా తీసుకెళ్తున్నాడు బిగ్‌‌బాస్‌. మంగళవారం ఎపిసోడ్ లో ఆదిరెడ్డి, శ్రీహన్, సుదీప ఈ టాస్క్ ని పూర్తి చేయగా మరికొంతమంది బుధవారం ఎపిసోడ్ లో ఈ టాస్క్ ని పూర్తి చేశారు.

మొదట గీతూ తన తండ్రితో ఆడియో కాల్‌ మాట్లాడింది. ఎమోషనల్ అయ్యేలా ఉన్నా కంట్రోల్ చేసుకొని బిగ్‌‌బాస్‌ తో ఛాలెంజ్ చేసింది కాబట్టి తన యాటిట్యూడ్ లోనే మాట్లాడింది గీతూ. ఆ తర్వాత అర్జున్‌ వాళ్ళ నాన్న దగ్గర్నుంచి వీడియో మెసేజ్‌ని తీసుకునే ఆప్షన్ తీసుకున్నాడు. తండ్రి వీడియో మెసేజ్ ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు అర్జున్. ఈ మధ్యలో ఆర్జే సూర్య కూడా ఏడుస్తూ నేను బిగ్‌‌బాస్‌ లో ఉండను, వెళ్ళిపోతాను అంటూ హడావిడి చేశాడు. సూర్య ఏడవడంతో ఇనయా దగ్గరికి తీసుకొని ఓదార్చింది.

BiggBoss 6 Day 37 : మళ్లీ రెచ్చిపోయిన గీతూ.. కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆడుకున్న బిగ్‌బాస్‌..

ఆ తర్వాత ఇనయా వాళ్ళ అమ్మా నాన్న ఉన్న ఫోటోని తీసుకునే ఆప్షన్ ఎంచుకుంది. ఆ ఫోటో వచ్చాక దాన్ని చూసి ఎమోషనల్ అయింది. ఆ తర్వాత ఫైమాకి బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో ఇంటి సభ్యులు కూడా సక్సెస్ అవ్వడంతో 85శాతం బ్యాటరీ రీచార్జ్ పెరిగింది. ఇక శ్రీసత్య వాళ్ళ అమ్మతో వీడియో కాల్ మాట్లాడే ఆప్షన్ తీసుకోవడంతో 35శాతం బ్యాటరీ తగ్గింది. అమ్మనాన్నతో మాట్లాడుతూ శ్రీ సత్య కూడా ఎమోషనల్ అయింది. ఇక బాలాదిత్య తన భార్య, పాపతో కాల్ మాట్లాడే ఛాన్స్ తీసుకున్నాడు. ఇలా ఈ ఎపిసోడ్ కూడా ఎమోషనల్ గానే సాగింది. అయితే కెప్టెన్సీ టాస్క్ కి తగ్గట్టు ఈ టాస్క్ లేదని ఇందులో జస్ట్ ఎమోషనల్ గా మాత్రమే ఉందని, ఎవరేంటో తెలిసే ఛాన్స్ లేదని ప్రేక్షకులు అంటున్నారు. మరి ఈ వారం కెప్టెన్ ని బిగ్‌‌బాస్‌ ఎవర్ని, ఎలా సెలెక్ట్ చేస్తాడో చూడాలి.