Salaar : బాలీవుడ్లో సలార్ కష్టమేనా? అసలు బాలీవుడ్లో గ్రాండ్ రిలీజ్ చేస్తారా?
ప్రభాస్ కి బాహుబలి తర్వాత నుంచి సరైన సక్సెస్ లేదు. 2017లో బాహుబలి రిలీజ్ అయిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ 3 ఫ్లాపులతో కంటిన్యూ అవుతున్నారు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, మొన్నీమధ్య వచ్చిన ఆదిపురుష్.. ఇలా మూడు సినిమాలు ఆడియన్స్ ని అసలు ఆకట్టుకోలేకపోయాయి.

Bollywood effect on Prabhas Salaar Movie no business for salaar in Bollywood
Prabhas Salaar Movie : బాహుబలితో బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు ప్రభాస్. సౌత్ లో ఎంత క్రేజ్ ఉందో బాలీవుడ్ లో కూడా అంతే క్రేజ్ సంపాదించుకుని అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయారు. అంతలా బాలీవుడ్ లో ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ని చూసి ఇప్పుడు అమ్మో ప్రభాస్ సినిమానా అంటూ టెన్షన్ పడుతున్నారు. ఆడియన్స్ లో క్రేజ్ ఉన్నా బాలీవుడ్ బాక్సాఫీస్ ని భయపెడుతున్నారు ప్రభాస్.
ప్రభాస్ కి బాహుబలి తర్వాత నుంచి సరైన సక్సెస్ లేదు. 2017లో బాహుబలి రిలీజ్ అయిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ 3 ఫ్లాపులతో కంటిన్యూ అవుతున్నారు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, మొన్నీమధ్య వచ్చిన ఆదిపురుష్.. ఇలా మూడు సినిమాలు ఆడియన్స్ ని అసలు ఆకట్టుకోలేకపోయాయి. ప్రభాస్ సినిమాని రిలీజ్ చేద్దామంటేనే భయపడుతున్నారు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్. అందుకే సలార్ కోసం ఎవ్వరూ ముందుకురావడం లేదనే టాక్ వినిపిస్తోంది.
మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా సలార్ లో కనిపించబోతున్నారు ప్రభాస్. బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ కి సలార్ హిట్ ఇస్తుందని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చెయ్యడానికి భయపడుతున్నారు. ఎందుకంటే సాహోని రిలీజ్ చేసి దాదాపు 60 కోట్లు, ఆదిపురుష్ ని రిలీజ్ చేసి 75 కోట్లు, రాధేశ్యామ్ ని రిలీజ్ చేసి 110 కోట్ల భారీ నష్టాల్ని చవిచూశారు. ఈ నష్టాల్లో బాలీవుడ్ శాతమే ఎక్కువ ఉంది. చాలా చోట్ల సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అందుకే మరోసారి ప్రభాస్ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చెయ్యాలంటే అంత ఈజీ కాదంటున్నారు.
దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేసింది. ఓవర్సీస్ లో స్పెషల్లీ అమెరికాలోనే 1979 లొకేషన్స్ లో సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా ఇన్ని లొకేషన్స్ లో రిలీజ్ కాలేదు అక్కడ. ఓవర్సీస్ లో క్రేజ్ ఉన్నా బాలీవుడ్ లో మాత్రం సలార్ కి బజ్ క్రియేట్ కావడం లేదు, బిజినెస్ కూడా జరగడం లేదన్న టాక్ నడుస్తోంది.
మొన్నీమధ్య రిలీజ్ అయిన సలార్ టీజర్ మీద కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు బాలీవుడ్ జనాలు. దాంతో ప్రభాస్ సలార్ మూవీ బాలీవుడ్ రిలీజ్ అన్నది పెద్ద సమస్యగా మారిపోయింది. రెండునెలల్లో రిలీజవుతున్న ఈ సినిమా మీద బజ్ ఎప్పుడు క్రియేట్ అవుతుందో, బిజినెస్ ఎప్పుడు జరుగుతుందో అని వెయిట్ చేస్తున్నారు. మరి బాలీవుడ్ లో సలార్ రిలీజయి అక్కడి ప్రేక్షకులని మెప్పిస్తుందా, అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు వస్తాయా చూడాలి.