Saif Alikhan : వారి లిమిట్స్ దాటారు.. అందుకే ఆ వ్యాఖ్యలు చేశాను.. మరోసారి మీడియాపై వ్యాఖ్యలు చేసిన సైఫ్..
శుక్రవారం రాత్రి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తన భార్యతో కలిసి ఓ పార్టీకి వెళ్లి ఇంటికి వస్తుంటే మీడియా వాళ్ళు, మరికొంతమంది తమ కెమెరాలు పట్టుకొని సైఫ్ ఇంటి గేటు లోపలి కూడా వచ్చేసి వెనక పడ్డారు, ఫోటోలు, వీడియోలు అడిగారు. సైఫ్ తన భార్య కరీనా కపూర్ తో...................

Bollywood hero Saif Alikhan comments on media again goes viral
Saif Alikhan : సెలబ్రిటీలు ఎప్పుడు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అంటూ మీడియా, సోషల్ మీడియా, అభిమానులు వాళ్ళ వెనకాల పడుతూనే ఉంటారు. బాలీవుడ్ లో దాదాపు చాలా మంది సెలబ్రిటీల ఇంటి ముందు, షూటింగ్స్ సెట్స్ బయట కొంతమంది మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కెమెరాలు పట్టుకొని సెలబ్రిటీలు ఎప్పుడు కనపడతారా, వాళ్ళని ఎప్పుడు వీడియోలు తీయాలా, ఫోటోలు తీయాలా, మాట్లాడించాలా అని రెడీగా ఉంటారు. ఒక్కోసారి వీళ్ళ ప్రవర్తనతో పలువురు సెలబ్రిటీలు విసిగి చెంది కొన్ని సార్లు వాళ్ళ మీద ఫైర్ అయ్యారు కూడా.
శుక్రవారం రాత్రి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తన భార్యతో కలిసి ఓ పార్టీకి వెళ్లి ఇంటికి వస్తుంటే మీడియా వాళ్ళు, మరికొంతమంది తమ కెమెరాలు పట్టుకొని సైఫ్ ఇంటి గేటు లోపలి కూడా వచ్చేసి వెనక పడ్డారు, ఫోటోలు, వీడియోలు అడిగారు. సైఫ్ తన భార్య కరీనా కపూర్ తో లోపలికి వెళ్తుంటే కొంతమంది వెనకే పడుతూ లోపలికి కూడా వెళ్లిపోతుంటే సైఫ్.. ఇంకెందుకు మా బెడ్ రూమ్స్ లోకి కూడా వచ్చేయండి అంటూ కౌంటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే కొంతమంది సెలబ్రిటీలకు ప్రైవసీ ఇవ్వాలని వీళ్లకు కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది అలా వ్యాఖ్యలు చేయడమేంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో మీడియా వాళ్ళు సైఫ్ ఇంటిలోపలికి కూడా వెళ్లిపోవడంతో తన ఇంటి సెక్యూరిటీ వాళ్ళని ఆపలేకపోయారని, అతన్ని సైఫ్ తీసేస్తున్నట్టు కథనాలు వచ్చాయి.
Balagam : బలగం మూవీ కథ నాదే అంటూ మీడియా ముందుకొచ్చిన జర్నలిస్ట్.. డైరెక్టర్ వేణు ఏమంటాడో??
తాజాగా దీనిపై సైఫ్ అలీఖాన్ వివరణ ఇస్తూ మరోసారి మీడియాకి కౌంటర్ వేశాడు. నేను మా ఇంటి సెక్యూరిటీని తొలగించట్లేదు. కెమెరాలు, వీడియోగ్రాఫర్లే మా సెక్యూరిటీని, మా ఇంటి గేటుని దాటుకొని వచ్చారు. మా ఇళ్లేదో వాళ్ళ హక్కు అయినట్టు వచ్చేశారు. దాదాపు 20 మంది కెమెరాలు, లైట్లు పట్టుకొని మా ఇంటి గేటు లోపలికి వచ్చేశారు. ఇది చాలా తప్పుడు ప్రవర్తన. అందరికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్లో ఉండాలి. కానీ వాళ్ళు వాళ్ళ హద్దుల్ని దాటారు. మేము కెమెరా మెన్స్ కి సహకరిస్తాము. కానీ అది ఇంటి బయట, గేట్ బయట. వాళ్ళు లిమిట్స్ దాటారు కాబట్టే నేను ఆ వ్యాఖ్యలు చేశాను అని అన్నారు. దీంతో సైఫ్ చేసిన వ్యాఖ్యలని సమర్ధించుకుంటూ మీడియా వాళ్లదే తప్పని మరోసారి కౌంటర్ ఇచ్చాడు.
#saifalikhan #KareenaKapoorKhan Ek Kaam Kariyega Hamare Bedroom me Aaiye ❤️ @viralbhayani77 pic.twitter.com/XXJVhSz4kP
— Viral Bhayani (@viralbhayani77) March 3, 2023