Rajkumar Rao : ఆరు కోట్ల కార్ కొనే స్థోమత లేదు.. నా దగ్గర డబ్బుంది అనుకుంటున్నారు.. స్టార్ హీరో వ్యాఖ్యలు..
బాలీవుడ్ లో ఆల్మోస్ట్ 14 ఏళ్లుగా ఉన్నా కొన్నేళ్ల నుంచే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు హీరో రాజ్ కుమార్ రావ్.

Bollywood Star Hero Rajkumar Rao Interesting Comments on his Financial Status
Rajkumar Rao : సాధారణంగా స్టార్ హీరోలు, సెలబ్రిటీల దగ్గర బాగా డబ్బు ఉంటుంది, రిచ్ గా బతుకుతారు, కార్లలో తిరుగుతారు, కోట్లల్లో రెమ్యునరేషన్స్ తీసుకుంటారు అని అనుకుంటారు. అయితే అది కొద్దిమందికే చెల్లుబాటు అవుతుందేమో. తాజాగా ఓ స్టార్ హీరో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
బాలీవుడ్ లో ఆల్మోస్ట్ 14 ఏళ్లుగా ఉన్నా కొన్నేళ్ల నుంచే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు హీరో రాజ్ కుమార్ రావ్. ఇటీవలే స్త్రీ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమా 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తాజాగా విక్కీ విద్య కా ఓ వాలా వీడియో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాజ్ కుమార్ రావ్.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కార్ కొనుగోలు, రెమ్యునరేషన్స్ గురించి ప్రస్తావన రాగా రాజ్ కుమార్ రావ్ మాట్లాడుతూ.. నా దగ్గర అంత డబ్బులు లేవు. జనాలు నా దగ్గర ఓ వంద కోట్లు ఉన్నాయి అనుకుంటున్నారు. నేను ఇంకా నా ఇంటి EMI కడుతున్నాను. నేను ఒక షో రూమ్ కి వెళ్లి 6 కోట్ల కార్ కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేను. 50 లక్షల రూపాయల కార్ కూడా కొనలేను, 20 లక్షల కార్ అయితే కొంతవరకు మేనేజ్ చేయగలను. చాలామంది యాక్టర్స్ కి ఓవర్ నైట్ లో డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటారు అని అన్నారు.
దీంతో రాజ్ కుమార్ రావ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నిజంగానే రాజ్ కుమార్ రావ్ దగ్గర డబ్బులు లేవా? వరుస సినిమాలు చేస్తున్నాడు కదా, ఆల్మోస్ట్ 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు కదా అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి రాజ్ కుమార్ రావ్ చెప్పిన అతని ఫైనాన్షియల్ కష్టాల గురించి ఆయనకే తెలియాలి.