బ్రహ్మీతో బన్నీ

బ్రహ్మానందాన్ని పరామర్శించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

  • Published By: sekhar ,Published On : February 7, 2019 / 09:35 AM IST
బ్రహ్మీతో బన్నీ

Updated On : February 7, 2019 / 9:35 AM IST

బ్రహ్మానందాన్ని పరామర్శించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

దాదాపు మూడు దశాబ్దాలుగా, ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ కింగ్.. బ్రహ్మానందం, ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న బ్రహ్మానందం త్వరగా కోలుకోవాలనీ, తిరిగి అందరికీ నవ్వులు పంచాలని, అభిమానులు, సినీ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేసారు. కొద్ది రోజుల క్రితం హార్ట్ సర్జరీ చేయించుకున్న బ్రహ్మానందం, ఇప్పుడు కోలుకుంటున్నారు. రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రహ్మానందాన్ని కలిసారు. బన్నీ స్వయంగా ఆయన ఇంటికెళ్ళి, ఆయణ్ణి పరామర్శించాడు.

బన్నీ, బ్రహ్మానందం కలిసి దిగిన ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేసాడు దర్శకుడు త్రివిక్రమ్. గుడ్ టు సీ యూ బ్రహ్మానందం గారు, ఓవర్ కమింగ్ ఇల్‌నెస్.. లుకింగ్ ఫార్వార్డ్ టు సీ యూ సూన్ ఎట్ స్క్రీన్ సర్.. అని త్రివిక్రమ్ పోస్ట్ చేసాడు. బ్రహ్మీ, బన్నీ కలిసి తీసుకున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.