BRO second single : బ్రో నుండి రొమాంటిక్ సాంగ్‌.. సెకండ్ సింగల్ ‘జాన‌వులే’

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌(Sai Dharam Tej) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం బ్రో. తమిళంలో ఘ‌న విజ‌యం సాధించిన‌ వినోద‌య సితం (Vinodaya Sitham) సినిమాకి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది.

BRO second single : బ్రో నుండి రొమాంటిక్ సాంగ్‌.. సెకండ్ సింగల్ ‘జాన‌వులే’

BRO second single Jaanavule

Updated On : July 12, 2023 / 6:31 PM IST

BRO second single Jaanavule : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌(Sai Dharam Tej) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం బ్రో. తమిళంలో ఘ‌న విజ‌యం సాధించిన‌ వినోద‌య సితం (Vinodaya Sitham) సినిమాకి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖనినే ఈ రీమేక్ కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది.

థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా జూలై 28న  ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను ఇప్ప‌టికే మొద‌లుపెట్టింది. టీజ‌ర్‌, ‘మై డియర్ మార్కండేయ’ అంటూ సాగే క్లబ్ సాంగ్ విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా మ‌రో అప్‌డేట్‌తో ముందుకు వ‌చ్చింది. సెకండ్ సింగ‌ల్‌ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

Shah Rukh Khan : న‌య‌న‌తార భ‌ర్త‌కు షారుఖ్ ఖాన్‌ వార్నింగ్.. ఆమెతో జాగ్ర‌త్త..

‘జాన‌వులే’ అంటూ ఈ పాట సాగ‌నుంది. ఇది ఓ రొమాంటిక్ సాంగ్ అని చిత్ర బృందం చెప్పింది. దీన్ని జూలై 15 విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

Ashish Vidyarthi : రెండో భార్య‌తో హ‌నీమూన్‌లో ఆశిష్ విద్యార్థి..! ముస‌లోడే కానీ..

ఈ సినిమాలో ప‌వ‌న్ మ‌రోసారి దేవుడిగా క‌నిపించ‌బోతున్నాడు. గ‌తంలో ‘గోపాల గోపాల’ చిత్రంలో మోడ్ర‌న్ శ్రీ కృష్ణుడి పాత్ర‌లో ప‌వ‌న్ క‌నిపించాడు. ఇక బ్రో సినిమాలో టైం అనే దేవుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు. సాయి ధ‌ర‌మ్‌తేజ్‌కు జోడిగా కేతిక శ‌ర్మ న‌టిస్తోంది.