Bunny Vasu : 19 ఏళ్ళ వయసులో అల్లు అరవింద్ దగ్గరికి.. బన్నీకి వాచ్ మెన్ గా పెట్టారు..

నిర్మాత బన్నీ వాసు గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో, బన్నీ పక్కనే ఉంటూ ఎదిగిన సంగతి తెలిసిందే.

Bunny Vasu : 19 ఏళ్ళ వయసులో అల్లు అరవింద్ దగ్గరికి.. బన్నీకి వాచ్ మెన్ గా పెట్టారు..

Bunny Vasu Interesting Comments on Producer Allu Aravind and Allu Arjun

Updated On : June 12, 2025 / 5:15 PM IST

Bunny Vasu : నిర్మాత బన్నీ వాసు గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో, బన్నీ పక్కనే ఉంటూ ఎదిగిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ – బన్నీ వాసు క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు. వాసు బన్నీ పేరుని తన పేరు పక్కన పెట్టుకున్నాడు అంటేనే వారిద్దరి బంధం ఎంత గట్టిదో తెలుస్తుంది. గతంలో అనేకమార్లు బన్నీ వాసు అల్లు అర్జున్ లేకపోతే నేను లేను అని చెప్పారు. గీత ఆర్ట్స్, అల్లు అరవింద్ ని వదిలి వెళ్ళను అని కూడా పలుమార్లు తెలిపారు.

అయితే తాజాగా బన్నీ వాసు కొత్త నిర్మాణ సంస్థ బన్నీ వాసు వర్క్స్ ప్రారంభించి మిత్రమండలి అనే సినిమాతో రాబోతున్నాడు. నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా అల్లు అరవింగ్ గెస్ట్ గా వచ్చారు.

Also Read : Kannappa : గుజరాత్‌ విమాన ప్రమాదం.. క్యాన్సిల్ అయిన ‘కన్నప్ప’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్..

ఈ ఈవెంట్లో తన లవ్ స్టోరీ గురించి అడగ్గా బన్నీ వాసు మాట్లాడుతూ.. నేను 19 ఏళ్ళ వయసులో అరవింద్ గారి దగ్గరకు వచ్చాను. అక్కడ్నుంచి నన్ను బన్నీ కి వాచ్ మెన్ గా పెట్టేసారు. నా లైఫ్ అంతా కాపలా కాయడానికే సరిపోయింది. నా లైఫ్ లో లవ్ పార్ట్ మిస్ అయిందంటే దానికి కారణం వంద శాతం అల్లు అరవింద్ గారు, బన్నీనే కారణం అని సరదాగా అన్నారు.

Also Read : Akkineni Family : అఖిల్ రిసెప్షన్.. ‘అక్కినేని ఫ్యామిలీ’ ఫుల్ ఫోటో వైరల్.. ఫొటోలో ఎవరెవరు ఉన్నారంటే..