Kannappa : గుజరాత్‌ విమాన ప్రమాదం.. క్యాన్సిల్ అయిన ‘కన్నప్ప’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నేడు ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది.

Kannappa : గుజరాత్‌ విమాన ప్రమాదం.. క్యాన్సిల్ అయిన ‘కన్నప్ప’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్..

Manchu Vishnu Kannappa Movie Trailer Launch Event Cancelled due to Ahmedabad Plane Crash Incident

Updated On : June 12, 2025 / 3:45 PM IST

Kannappa : మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27 న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో వరుసగా ప్రమోషన్స్ చేస్తూ భారీ ఈవెంట్స్ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నారు. రేపు జూన్ 13 కన్నప్ప సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ప్లాన్ చేసారు. అయితే ప్రస్తుతం కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నేడు ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు మరణించినట్లు తెలుస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : Gaddar Awards : తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కీలక ప్రెస్ మీట్.. దిల్ రాజు, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో..

ఈ ప్రమాదం కారణంగానే కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేస్తున్నామని, ట్రైలర్ రిలీజ్ ని ఒకరోజు వాయిదా వేస్తున్నామని, మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తూ మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

 

Also Read : Tollywood : సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. పవన్ తో కలిసి.. ఎప్పుడంటే..? ఏ ఏ అంశాలు చర్చించనున్నారు..?