Sneha Reddy : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బన్నీ భార్య స్నేహా రెడ్డి

అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు.

Sneha Reddy : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బన్నీ భార్య స్నేహా రెడ్డి

Sneha Reddy

Updated On : January 29, 2024 / 10:10 AM IST

Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తిరుమలకు శ్రీవారిని దర్శించుకున్నారు. స్నేహా ఫ్యామిలీతో వచ్చినట్లు కనిపించలేదు. ఆమె వెంట బన్నీ కానీ, పిల్లలు కానీ కనిపించలేదు.

Sneha Reddy

Sneha Reddy

బన్నీ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. భర్త అల్లు అర్జున్, పిల్లలు అయాన్, అర్హ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే  స్నేహా రెడ్డి ‘పికాబూ’ అనే ఫోటో స్టూడియో వ్యాపారం కూడా చేస్తున్నారు. తాజాగా స్నేహా రెడ్డి తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బయటకు వస్తూ ఆమె కనిపించారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా వచ్చినట్లు తెలుస్తోంది.

Director Nandini

Director Nandini

కాగా తిరుమలలో డైరెక్టర్ నందిని, నటి ప్రగతి కూడా కనిపించారు. వీరితో ఫోటోలు దిగాలని అభిమానులు ఉత్సాహ పడ్డారు.