అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా ఎన్టీఆర్.. బాబాయ్, అబ్బాయ్ మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ పై బీవీఎస్ రవి క్లారిటీ
బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోతో మరింత వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోకి ఎన్టీఆర్ మాత్రం రాలేదు.

Balayya – NTR : బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోతో మరింత వైరల్ అయిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులను తెచుకొచ్చి సరికొత్త టాక్ షోతో అందర్నీ మెప్పించారు. అసలు బాలయ్య లాంటి హీరో ఇంత సరదాగా టాక్ షో చేయడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ షోకి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని, రవితేజ, ప్రభాస్, బన్నీ.. ఇలా స్టార్ హీరోలంతా వచ్చారు. అయితే ఈ షోకి ఎన్టీఆర్ మాత్రం రాలేదు.
గత కొంతకాలంగా ఎన్టీఆర్ కి – బాలకృష్ణ కు మధ్య ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయని, వాళ్ళు మాట్లాడుకోవట్లేదని పలు రూమర్లు వచ్చాయి. బాలయ్య – ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా విమర్శలు చేసుకున్నారు. అందుకే ఎన్టీఆర్ అన్‌స్టాపబుల్ షోకి రాలేదని, పిలవలేదని కూడా కామెంట్స్ చేసారు. ఆ షోలో అందరి హీరోల గురించి అడిగి ఎన్టీఆర్ గురించి ఎవ్వర్నీ అడగలేదని కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాపోయారు.
అయితే తాజాగా రచయిత BVS రవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. ఎన్టీఆర్ అన్‌స్టాపబుల్ షోకి ఎందుకురాలేదు, వాళ్లకు ఏమైనా ఫ్యామిలీ ఇష్యుస్ ఉన్నాయా అని ప్రశ్నించారు.
దానికి BVS రవి సమాధానమిస్తూ.. బాలయ్య – ఎన్టీఆర్ కి ఫ్యామిలీ ఇష్యూస్ ఏం లేవు. అవి అన్ని సృష్టించినవే. బాబాయ్ – అబ్బాయిల మధ్య ఏం సమస్యలు ఉంటాయి. ఎన్టీఆర్ – బాలయ్య రోజూ కలిసి కనిపిస్తే హైప్ ఉండదు. అదే రేర్ గా కనిపిస్తే ఫ్యాన్స్ కి, మీడియాలో హైప్ ఉంటుంది. వాళ్ళు బాగున్నారు అంటే ఎవరికీ ఇంట్రెస్ట్ రాదు, వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. అవన్నీ సృష్టించినవే, ట్విట్టర్ గొడవలే. రియల్టీలో ఏం లేదు. ఎన్టీఆర్ గారు అన్‌స్టాపబుల్ షోకి తర్వాత కచ్చితంగా వస్తారు. షూట్స్ వల్ల బిజీగా ఉండటం, చేసే సినిమా లుక్ రివీల్ అవుతుందేమో అని, ట్రావెలింగ్ లో బిజీ ఉండటం లాంటి కారణాల వల్లే ఎన్టీఆర్ గారు వచ్చి ఉండరు అంతే తప్ప ఎలాంటి సమస్యలు లేవు అని తెలిపారు.