Nani : ఇంత మంచి సినిమాని ఇంత లేటుగా చూశానంటే న‌మ్మ‌లేక పోతున్నా

కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ముఖ్యపాత్రల్లో తెర‌కెక్కించిన చిత్రం బలగం. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాను దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మించారు.

Nani : ఇంత మంచి సినిమాని ఇంత లేటుగా చూశానంటే న‌మ్మ‌లేక పోతున్నా

Nani after watching Balagam movie

Updated On : June 20, 2023 / 6:55 PM IST

Nani after watching Balagam movie : కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) ముఖ్యపాత్రల్లో తెర‌కెక్కించిన చిత్రం బలగం(Balagam). మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాను దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) నిర్మించారు. చిన్న సినిమాగా విడుద‌లైన ఈ సినిమా ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకున్న సంగ‌తి తెలిసిందే.

విడుద‌లై చాలా రోజులు కాగా.. తాజాగా ఈ సినిమాని నేచుర‌ల్ స్టార్ నాని చూశాడు. సినిమా అద్భుతంగా ఉంద‌ని, క్లాసిక్‌కి ప్రాణం పోసిన ప్రతి ఒక్క‌రిని అభినందించాడు. ఇంత మంచి సినిమాని తాను ఆల‌స్యంగా చూశానంటే న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశాడు.

‘నేను ఇంత ఆలస్యంగా చూశాను అంటే నమ్మలేకపోతున్నాను. ఇది చాలా కాలంగా తెలుగు సినిమాకి దక్కిన అర్హత కాదా?.  ఈ క్లాసిక్‌కి ప్రాణం పోసిన మీరంతా నా హృద‌యంలో ఉన్నారు.’ అంటూ నాని ట్వీట్ చేశాడు.

సెకండ్ మూవీ రైటింగ్ ప్రారంభం

ఇదిలా ఉంటే.. బ‌ల‌గం సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన వేణు సోష‌ల్ మీడియా ద్వారా ఓ అప్‌డేట్ ఇచ్చాడు. త‌న రెండో సినిమా రైటింగ్ స్టార్ చేసిన‌ట్లు తెలియ‌జేశాడు. స్క్రిప్టు పనులని మొదలు పెట్టినట్టుగా పెన్ను, పేపర్ పిక్ ని షేర్ చేసాడు. దీంతో నెటీజ‌న్లు మ‌రోసారి బ‌లగం లాంటి హిట్ కొట్టాల‌ని శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కాగా.. ఈ సినిమా ఏ జోన‌ర్‌లో ఉండ‌నుంది. న‌టీన‌టులు ఎవ‌రు వంటి విష‌యాలు మాత్రం వెల్ల‌డించ‌లేదు.