Nayan Vignesh : నయనతార – విగ్నేష్ శివన్‌పై కేసు నమోదు.. ఆస్తి తగాదాల విషయంలో సొంత కుటుంబ సభ్యులే..
నయనతార, విగ్నేష్ శివన్ పై తమిళనాడు తిరుచ్చి పోలీస్ స్టేషన్ లో సొంత కుటుంబ సభ్యులే ఆస్తి తగాదాల నేపథ్యంలో కేసు వేశారు.

case files on Nayanathara and Vignesh Shivan in Property Issue news goes viral
Nayanathara Vignesh Shivan : లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ కొన్నాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చి ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తూనే ఇద్దరూ సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. కానీ ఈ జంట అప్పుడప్పుడు ఏదో ఒక వివాదంలో నిలుస్తూ వార్తల్లో ఉంటున్నారు. తాజాగా మరోసారి నయనతార విగ్నేష్ శివన్ జంట వార్తల్లో నిలిచింది.
నయనతార, విగ్నేష్ శివన్ పై తమిళనాడు తిరుచ్చి పోలీస్ స్టేషన్ లో సొంత కుటుంబ సభ్యులే ఆస్తి తగాదాల నేపథ్యంలో కేసు వేశారు. విగ్నేష్ శివన్ తండ్రి శివ ఇటీవల కొన్నాళ్ల క్రితం మరణించారు. అయితే ఆయన బతికున్నప్పుడు అతని సోదరుల ఆస్తిని ఎవరికీ చెప్పకుండా అమ్మేసుకోని ఆ డబ్బులు సొంతంగా వాడేసుకున్నాడని విగ్నేష్ బాబాయ్ కేసు పెట్టారు.
Anupam Kher : రవీంద్రనాధ్ ఠాగూర్ గా అనుపమ్ ఖేర్.. ఈ ఫోటో చూశారా? అచ్చు దింపేశారు..
ఆయన ప్రస్తుతం లేరు కాబట్టి విగ్నేష్ శివన్ తో పాటు అతని తల్లి, భార్య, సోదరిలపై కూడా కేసు నమోదు చేశారు. తమ ప్రాపర్టీ కానీ, దానికి తగ్గ డబ్బులు కానీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వార్త తమిళనాడులో సంచలనంగా మారింది. అయితే ఇప్పటిదాకా దీనిపై విగ్నేష్, నయనతారలు స్పందించలేదు.