దీపాలు వెలిగించిన సెలబ్రిటీలు..
ప్రధాని పిలుపుకు స్పందించిన సెలబ్రిటీలు.. దీపాలతో సందడి..

ప్రధాని పిలుపుకు స్పందించిన సెలబ్రిటీలు.. దీపాలతో సందడి..
కరోనాపై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 5వ తేది ఆదివారం రాత్రి అందరూ 9 గంటలకు 9 నిమిషాల పాటు ఎవరికి తోచిన విధంగా వారు లైట్లు వెలిగించి వెలుగును ప్రసరింపజేసి, భారతీయుల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనికి భారతీయులందరూ ఎంతగానో సంఘీభావం తెలిపారు.
ప్రజలంతా ఐక్యత తెలుపుతూ ఏకతాటిపైకి వచ్చారు. సెలబ్రిటీలు కూడా ఈ విభిన్నమైన కార్యక్రమంలో భాగమయ్యారు. తాము ఏ విధంగా సంఘీభావం తెలుపుతున్నామనేది.. సోషల్ మీడియా ద్వారా ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, ‘యాక్షన్ కింగ్’ అర్జున్, మహేష్ బాబు, అల్లు అరవింద్, పపవన్ కల్యాణ్, సాయి కుమార్, శ్రీకాంత్, పరుచూరి గోపాలకృష్ణ, రాజశేఖర్, నందమూరి కళ్యాణ్ రామ్, గోపిచంద్, కార్తికేయ, విశ్వక్ సేన్, మంచు విష్ణు,
మంచు లక్ష్మీ ప్రసన్న, నయనతార, మంజులా ఘట్టమనేని, లారెన్స్, ఉపాసన కొణిదెల, ప్రగ్యా జైస్వాల్, హరీష్ శంకర్, ఈషా రెబ్బా, దీపికా పదుకొణె, రణ్‌వీర్, కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్, పరేష్ రావెల్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, యాంకర్ ప్రదీప్, గాయత్రి భార్గవి, ప్రభాకర్, శివ కందుకూరి ఇలా ప్రతి ఒక్కరు దీపాలను వెలిగించి ప్రధాని మాటను పాటించారు.
Read Also : సొసైటీ కోసం పిల్లలు కూడా వద్దనుకున్నాడు కొరటాల..