Chandini Chowdary: సోషల్ మీడియా వేధింపులతో సతమతమవుతున్న కలర్ ఫోటో బ్యూటీ

టాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ చాందినీ చౌదరి, ‘కలర్ ఫోటో’ ఫోటో సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఆ సినిమా అందుకున్న సక్సెస్‌తో అమ్మడికి ఒక్కాసారిగి మంచి ఫేం కలిసొచ్చింది. అయితే ఆ తరువాత కూడా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రావడం లేదు.

Chandini Chowdary: సోషల్ మీడియా వేధింపులతో సతమతమవుతున్న కలర్ ఫోటో బ్యూటీ

Chandini Chowdary Becomes Victim Of Social Media Harassment

Updated On : December 10, 2022 / 7:09 PM IST

Chandini Chowdary: టాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ చాందినీ చౌదరి, ‘కలర్ ఫోటో’ ఫోటో సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఆ సినిమా అందుకున్న సక్సెస్‌తో అమ్మడికి ఒక్కాసారిగి మంచి ఫేం కలిసొచ్చింది. అయితే ఆ తరువాత కూడా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రావడం లేదు.

Chandini Chowdary : ఇండస్ట్రీలో కనబడకుండా చేస్తా అని బెదిరించాడు..

ఇదిలా ఉండగా, అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. కాగా, ఇప్పుడు అదే తనకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టినట్లుగా చాందినీ చౌదరి పేర్కొంది. ఇటీవల కొందరు స్కామర్లు తన పేరుతో పాటు తన కొలీగ్స్ పేరుతో ఇతరుల డేటాను తీసుకుని, వారిని వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. తన పేరుతో ఫోన్ చేసి ఎవరైనా మీ వివరాలు అడిగితే దయచేసి ఎలాంటి విషయాలను చెప్పవద్దంటూ ఆమె తన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపింది. దీనికి సంబంధించి పలు స్క్రీన్‌షాట్స్ కూడా చాందినీ ఈ సందర్భంగా పోస్ట్ చేసింది.

హీరోయిన్‌లనే వదలని ఈ స్కామర్లు ఇక సామాన్య ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందని చాందినీ తెలిపింది. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సైబర్ ఫ్రాడ్ జరిగినా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఆమె ఈ సందర్భంగా కోరింది.