Chandrababu Naidu : సూపర్ స్టార్‌కి చంద్రబాబు స్పెషల్ బర్త్‌డే విషెష్..

తాజాగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రజినీకాంత్ కి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Chandrababu Naidu : సూపర్ స్టార్‌కి చంద్రబాబు స్పెషల్ బర్త్‌డే విషెష్..

Chandrababu Naidu Special Birthday Wishes to Super Star Rajinikanth

Updated On : December 12, 2023 / 9:40 AM IST

Chandrababu Naidu : నేడు సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) పుట్టిన రోజు. ఒక బస్ కండెక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగి ఎన్నో దేశాల్లో కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్నారు రజినీకాంత్. ఆయన పుట్టిన రోజు అంటే అభిమానులకు పండగే. 73 ఏళ్ళ వయసులో కూడా రజినీకాంత్ సినిమాలు తీస్తూ అభిమానులని మెప్పిస్తున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రజినీకాంత్ కి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన మిత్రుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, జీవితంలో మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అని గతంలో రజినితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ విషెష్ తెలిపారు. దీంతో చంద్రబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Rajinikanth : సూపర్ స్టార్ బర్త్‌డే.. 73 ఏళ్ళ వయసులో కూడా అభిమానుల కోసం కష్టపడుతున్న రజినీకాంత్..

చంద్రబాబు, రజినీకాంత్ మంచి మిత్రులు అని అందరికి తెలుసు. గతంలో ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలకు కూడా చంద్రబాబు ఆహ్వానం మీద రజినీకాంత్ వచ్చి పాల్గొన్నారు. అయితే ఆ మీటింగ్ పొలిటికల్ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే.