Chandrabose : 20 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు చంద్రబోస్‌కి.. మొత్తం ఎంతమంది రచయితలకు..

ఇప్పటివరకు ఎంతమంది టాలీవుడ్ లిరిక్ రైటర్స్ నేషనల్ అవార్డుని అందుకున్నారో తెలుసా..? 1968 నుంచి ఈ క్యాటగిరీ అవార్డుని అందిస్తుండగా..

Chandrabose : 20 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు చంద్రబోస్‌కి.. మొత్తం ఎంతమంది రచయితలకు..

Chandrabose and best lyric writer national award winners list from 1968

Chandrabose : టాలీవుడ్ సెన్సేషన్ లిరిక్ రైటర్ చంద్రబోస్ ఇటీవల RRR చిత్రానికి పలు ఇంటర్నేషనల్ అవార్డులతో పాటు ఆస్కార్ (Oscar) అవార్డుని కూడా సొంతం చేసుకొని హిస్టరీ క్రియేట్ చేశారు. తాజాగా ప్రతిష్టాత్మక పురస్కారమైన జాతీయ అవార్డుని కూడా అందుకొని సంచలనం సృష్టించారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కొండ‌పొలం’ సినిమాలోని ‘ధం ధం ధం’ పాటకు గాను గాను చంద్రబోస్ నేషనల్ అవార్డుని అందుకున్నారు. దాదాపు 20 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు తెలుగు రచయితకు లిరిక్ రైటర్ క్యాటగిరీలో అవార్డు వరించింది.

Allu Arjun : నేషనల్ అవార్డుకు ఎంపికైన ఆనందంలో బన్నీ.. వైరల్ అవుతున్న అల్లు అయాన్ వీడియో..

అసలు ఇప్పటివరకు ఎంతమంది టాలీవుడ్ లిరిక్ రైటర్స్ ఈ నేషనల్ అవార్డుని అందుకున్నారో తెలుసా..? 1968 నుంచి ఈ క్యాటగిరీ అవార్డుని అందిస్తుండగా.. తెలుగు పదానికి కేవలం నాలుగుసార్లు మాత్రమే జాతీయ పురస్కారం జరిగింది. 1974లో మొదటిసారి శ్రీశ్రీ జాతీయ అవార్డుని అందుకున్నారు. పి ఆదినారాయణ రావు సంగీతం దర్శకత్వంలో వచ్చిన ‘అల్లూరిసీతారామరాజు’ సినిమా కోసం రాసిన ‘తెలుగువీర లేవరా’ పాటకు గాను బెస్ట్ లిరిక్ రైటర్ గా శ్రీశ్రీ అవార్డుని అందుకున్నారు. ఘంటసాల, వి రామకృష్ణ ఈ పాటని ఆలపించారు.

Nani : ఆ సినిమా అవార్డు గెలుచుకోనందుకు బాధ పడుతున్న నాని.. ఏ మూవీ తెలుసా..?

ఈ అవార్డు తరువాత మరో నేషనల్ అవార్డు కోసం 19 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. 1993లో ‘మాతృదేవోభవ’ మూవీలోని ‘రాలిపోయే పువ్వా’ సాంగ్ కి లిరిక్స్ అందించిన ‘వేటూరి సుందరరామ్మూర్తి’ నేషనల్ అవార్డుని అందుకున్నారు. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తూ తానే పాటని పాడారు. ఇక మూడో నేషనల్ అవార్డు అందుకోవడానికి 20 ఏళ్ళు సమయం పట్టింది.

Pushpa 2 : నేషనల్ అవార్డుతో సీక్వెల్ పై మరింత అంచనాలు.. రిలీజ్‌ కోసం ఆ డేట్ ఫిక్స్ చేశారట..!

చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఠాగూర్’ సినిమాకి మణిశర్మ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ మూవీలోని ‘నేను సైతం’ సాంగ్ కి ‘సుద్దాల అశోక్ తేజ’ లిరిక్స్ సమకూర్చగా ‘ఎస్పీ బాలసుబ్రమణ్యం’ తన గాత్రంతో ప్రాణం పోశారు. ఈ పాటకు గాను 2003 లో సుద్దాల అవార్డుని అందుకున్నారు. ఈ పురస్కారం తరువాత మళ్ళీ 20 ఏళ్లకే.. అంటే ఇప్పుడు చంద్రబోస్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక యాద్రుచికం ఏంటంటే.. అవార్డుకి అవార్డుకి మధ్య 20 ఏళ్ళ గ్యాప్ ఉండడం.