లాక్‌డౌన్ వేళ కుక్కతో కాలక్షేపం చేస్తున్న ఛార్మి..

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లల్లోనే ఉండిపోయారు. సెలబ్రిటీలు తమరోజు వారీ పనుల తాలూకు ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా నటి, నిర్మాత ఛార్మి తన పెంపుడు కుక్కతో కలిసున్న ఫొటోను తన ట్విట్టర్లో షేర్ చేసింది.
ఆ ఫొటోకి..‘‘మై క్వారంటైన్ పార్టనర్’’ అంటూ కొటేషన్ ఇచ్చింది. ఈ పిక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లైక్స్, కామెంట్స్ కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. నటి నుండి నిర్మాతగా టర్న్ అయిన ఛార్మి ‘రొమాంటిక్’, ‘ఫైటర్’ అనే చిత్రాలు పూరి జగన్నాథ్‌తో కలిసి నిర్మిస్తోంది.