మూడు రోజులాడే సినిమా అంట

చీకటి గదిలో చితక్కొట్టుడు - టీజర్

  • Published By: sekhar ,Published On : January 3, 2019 / 07:01 AM IST
మూడు రోజులాడే సినిమా అంట

చీకటి గదిలో చితక్కొట్టుడు – టీజర్

అర్జున్ రెడ్డి, ఆర్‌‌ఎక్స్ 100 సినిమాల స్పూర్తితో, అదే రూట్‌లో కొన్ని చిన్న సినిమాలొచ్చాయి. ఇంకొన్ని రాబోతున్నాయి కూడా. కంటెంట్‌ ఉన్నా, లేకపోయినా, మాంచి మసాలా సీన్స్ ఉంటే చాలు, యూత్ థియేటర్లకి పరుగులు పెడతారనేది దర్శక, నిర్మాతల ఆలోచన కాబోలు.. ఇప్పుడు అర్జున్ రెడ్డి, ఆర్‌‌ఎక్స్ 100 సినిమాలను మించి, ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరు, చీకటి గదిలో చితక్కొట్టుడు.. నిజంగా ఇది సినిమా టైటిలే..

జెనీలియా కథ, రాజశేఖర్ గరుడవేగ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అథిత్ అరుణ్, మిర్చి హేమంత్, భాగ్యశ్రీ మోటే, నిక్కీ టంబోలి మొయిన్ లీడ్స్‌గా, బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై, సంతోష్ పి జయకుమార్ డైరెక్షన్‌లో రూపొందుతున్న చీకటి గదిలో చితక్కొట్టుడు టీజర్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది. టీజర్ స్టార్టింగ్‌లోనే, 18 సంవత్సరాల లోపు వయస్సున్న వారికి ఈ టీజర్ ప్రదర్శన నిషేదింప బడింది అనే హెచ్చరికతో, సినిమాలోనూ, టీజర్‌‌లోనూ మాంచి హాట్ అండ్ ఘాటు మసాలా ఉండబోతోందని హింట్ ఇచ్చింది మూవీ యూనిట్, క్రిటిక్ కత్తి మహేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీజర్ ఓపెన్ చేసి, అతని చేత చీకటి గదిలో చితక్కొట్టుడు ఒక శృంగారంతో కూడిన హారర్ సినిమా అని చెప్పించారు.

ఇక టీజర్‌లో ఉన్న దెయ్యం షాట్స్ సంగతి పక్కన పెడితే, కుర్రకారు రొమాన్స్‌తో రెచ్చిపోయి, రెచ్చగొట్టారు. అసలే బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్, ఇక బీచ్‌లు, బికినీలు.. అబ్బో, రచ్చ రంబోలా చేసి పడేసారులే.. టీజర్ చివర్లో, ఈ సినిమా మామూలుగానే మూడు రోజులాడుతుంది, మీరు ధర్నాలు, డిబేట్లు పెట్టి సూపర్ హిట్ చేసెయ్యకండి అని చెప్పించడం చూస్తే, మేకర్స్‌కి సినిమాపై ఎంత కాన్ఫిడెంట్ ఉందో అర్థమవుతుంది. చీకటి గదిలో చితక్కొట్టుడు సంగతేంటో మీరూ ఓ లుక్కెయ్యండి.

వాచ్ టీజర్…