Chiranjeevi : అంద‌రికి చెప్పండి.. మార్పు తీసుకురండి.. ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌దే : చిరంజీవి

డ్ర‌గ్స్ ర‌హిత స‌మాజ‌మే ల‌క్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.

Chiranjeevi : అంద‌రికి చెప్పండి.. మార్పు తీసుకురండి.. ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌దే : చిరంజీవి

Chiranjeevi Anti Drug awareness campaign message

డ్ర‌గ్స్ ర‌హిత స‌మాజ‌మే ల‌క్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్ వాడుతున్నా, కొనుగోలు చేస్తున్నా లేదా పంపిణీ చేస్తున్నట్లయితే వెంట‌నే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు తెలియ‌జేయాల‌ని చిరు సూచించారు. తెలంగాణ సీఎంఓ నేతృత్వంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో చిరంజీవి భాగమయ్యారు. ఈ నేప‌థ్యంలో ఓ వీడియోను, ఓ మెసేజ్‌ను ఎక్స్‌(గ‌తంలో ట్విట్ట‌ర్‌) షేర్ పోస్ట్ చేశారు.

తెలంగాణ సీఎంఓ నేతృత్వంలోని డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని చిరు చెప్పారు. మీరు లేదా మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్ వాడుతున్నా, కొనుగోలు చేస్తున్నా లేదా పంపిణీ చేస్తున్నట్లయితే వెంట‌నే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో 87126 71111 నంబ‌ర్‌కు ఫోన్ చేయాల‌న్నారు. స‌మాచారం అందించిన వారి వివ‌రాలు గోప్యంగా ఉంచ‌బ‌డ‌తాయ‌న్నారు. బాధితులను వ్యసనాల నుండి విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం తప్ప వారిని శిక్షించడం కాదన్నారు.

200 కోట్లు జ‌స్ట్ మిస్‌.. క‌ల్కి ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే..?

డ్రగ్స్ రహిత సమాజాన్ని సాధించేందుకు నాతో పాటు తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కల‌పాల‌ని చెప్పారు. ఈ సందేశాన్ని అందరికీ తెలియ‌జేసి మార్పు తీసుకురావాల‌ని చిరంజీవి కోరారు. ఈ మేర‌కు ట్వీట్ చేశారు. అలాగే వీడియోలో డ్ర‌గ్స్ వాడ‌కం వ‌ల్ల జీవితాలు ఎలా నాశ‌నం అవుతున్నాయో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు.