మెగా బ్రదర్ బర్త్‌డే వేడుకల్లో మెగాస్టార్

  • Published By: sekhar ,Published On : October 29, 2020 / 01:22 PM IST
మెగా బ్రదర్ బర్త్‌డే వేడుకల్లో మెగాస్టార్

Updated On : October 29, 2020 / 1:29 PM IST

Chiranjeevi-Nagababu: అన్నయ్య అడుగుజాడల్లో నటుడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, నిర్మాతగా మారి.. బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న మెగా బ్రదర్‌ కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు) పుట్టినరోజు గురువారం. ఈ సందర్భంగా నాగబాబు అన్నయ్య, మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘విధేయుడు, ఎమోషనల్‌ పర్సన్‌, దయగల హృదయమున్న వ్యక్తే కాదు.. చాలా సరదాగా ఉండే వ్యక్తి, నా సోదరుడు నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను!’’ అని ట్వీట్‌ చేశారు. మెసేజ్‌తో పాటు చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్‌ కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు.

Image

దీనికి నాగబాబు కూడా ట్విట్టర్‌ ద్వారా ‘‘థాంక్స్‌ అన్నయ్య.. నేనెప్పుడూ నీతోడై ఉంటాను’’ అని స్పందించారు. చిరంజీవి ఛారిటబల్ ట్రస్టులో రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు తర్వాత అన్నయ్య చిరంజీవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. నిహారిక, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌ తదితరులు నాగబాబుకి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు అభినందనలు తెలియజేశారు.