Chiranjeevi : శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి చిరంజీవి సాయం

శివ శంకర్ మాస్టర్ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన ఆయన చిన్న కొడుకు అజయ్‌కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. .

Chiranjeevi : శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి చిరంజీవి సాయం

Shiva Shankar Master Health

Updated On : November 26, 2021 / 6:33 PM IST

Chiranjeevi: ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్ కి కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా హైదరాబాద్ AIG ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 75 శాతం పైగా ఊపిరితిత్తులు పాడయ్యాయని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. మాస్టర్ మాత్రమే కాక ఆయన కుటుంబంలో ఆయన భార్యకి, పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకింది. పెద్ద కొడుకుకి కూడా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఆయన భార్య మాత్రం హోం క్వారంటైన్ లో ఉన్నారు.

Sonu Sood : శివశంకర్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తా- సోనూసూద్

శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు అజయ్ అందరి బాగోగులు చూసుకుంటున్నాడు, శివశంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమౌతోందని, రోజుకు లక్ష రూపాయల దాకా వైద్య ఖర్చుల అవుతోందని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియడంతో సోనూ సూద్, మంచు విష్ణు తదితరులు సాయం చెయ్యడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తనవంతు సహాయం అందజేశారు.

Shiva Shankar Master : శివశంకర్ మాస్టర్‌కి అండగా ఉంటాను.. హాస్పిటల్ వైద్యులతో మాట్లాడిన మంచు విష్ణు

శివ శంకర్ మాస్టర్ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన ఆయన చిన్న కొడుకు అజయ్‌కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు. అంతేకాక వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్‌కు మేమంతా ఉన్నాం అని అభయమిచ్చారు.

 

Shiva Shankar Master Son

చిరంజీవిని కలిసి చెక్ తీసుకున్న తర్వాత అజయ్ మాట్లాడుతూ.. ‘నాన్న గారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారు, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు’ అని వెల్లడించారు. చిరంజీవి గారు అంటే నాన్న గారికి ఎంతో అభిమానం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి గారితో సినిమాలు నాన్న గారు కలిసి చేశారని వెల్లడించారు. ఇటీవల ‘ఆచార్య’ షూటింగులో కూడా నాన్నగారు చిరంజీవిని కలిశారని అజయ్ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి తనకి చాలా అవసరం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి గారు చేసిన సాయం ఎన్నటికీ మరువలేని ఆయనకి ఎన్నటికీ రుణపడి ఉంటానని అన్నారు.

Shiva Shankar Master : ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ శివశంకర్ మాస్టర్‌కు కరోనా… ఆరోగ్యం విషమం