మోహన్ బాబుకి ముద్దు పెట్టిన చిరంజీవి : అసలేం జరిగిందంటే..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) డైరీ ఆవిష్కరణ కార్యకమంలో ఆసక్తికర ఘటన జరిగింది. సీనియర్ నటులు మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఇంట్రస్టింగ్ సీన్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) డైరీ ఆవిష్కరణ కార్యకమంలో ఆసక్తికర ఘటన జరిగింది. సీనియర్ నటులు మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఇంట్రస్టింగ్ సీన్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) డైరీ ఆవిష్కరణ కార్యకమంలో ఆసక్తికర ఘటన జరిగింది. సీనియర్ నటులు మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఇంట్రస్టింగ్ సీన్ కనిపించింది. మోహన్ బాబు మాట్లాడుతున్న సమయంలో.. చిరంజీవి ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అంతేకాదు.. మోహన్ బాబు బుగ్గపై ముద్దు కూడా పెట్టారు. ఈ సీన్ హైలైట్ గా మారింది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీలు ఒకే వేదికపై కూర్చొని సరదాగా ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకునేవారని మోహన్ బాబు గుర్తు చేశారు. అలాగే తాను, చిరంజీవి కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకుంటుంటామని చెప్పారు. అదంతా సరదాకే తప్ప తమ మధ్య నిజంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు. మోహన్ బాబు మాటలకు ముగ్దుడైన చిరంజీవి.. ఆయనను ఆలింగనం చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టి ఆనందం వ్యక్తం చేశారు.
చిరంజీవితో విభేదాలు లేవు:
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులంతా ఒకే తల్లి బిడ్డలని మోహన్ బాబు అన్నారు. రాష్ట్రంలో ఉన్న 10 కోట్ల మందిలో ఎంతోమంది అందగాళ్లు, ప్రతిభావంతులు ఉండగా.. ఇండస్ట్రీలో తమకే అవకాశం దక్కడం నిజంగా అదృష్టం అన్నారు. కుటుంబాల్లో చిన్న చిన్న తగాదాలు ఉన్నట్టే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లోనూ చిన్న చిన్న విభేదాలు ఉంటాయన్నారు. ఏది ఏమైనా తమదంతా ఒకే కుటుంబం అని మోహన్ బాబు స్పష్టం చేశారు. చిరంజీవికి, నాకు ఎలాంటి విభేదాలు లేవని, మా రెండు కుటుంబాలు ఎప్పటికీ ఒక్కటే అని మోహన్ బాబు వెల్లడించారు.
చిరంజీవి అద్భుతంగా మాట్లాడారు:
వేదికపై చిరంజీవి చాలా అద్భుతంగా మాట్లాడారని మోహన్ బాబు కితాబిచ్చారు. చిరంజీవి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదన్నారు. ”మా” లో ఏం జరుగుతుందో నాకు తెలుసు అన్నారు. వేదికపై ఏమీ మాట్లాడొద్దని నరేష్ కు ముందే చెప్పాను అన్నారు. మనమంతా ఒకే తల్లి బిడ్డలం, కలిసి మెలిసి ముందుకెళ్దామని మోహన్ బాబు పిలుపునిచ్చారు. ”మా” ఎవడబ్బ సొత్తు కాదు.. అందరి సొత్తు అని మోహన్ బాబు స్పష్టం చేశారు. సినీ పరిశ్రమను ఆదుకున్న ఏకైక వ్యక్తి టి.సుబ్బరామి రెడ్డి అని మోహన్ బాబు అన్నారు. 40 ఏళ్లుగా సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారని ప్రశంసించారు. అలాంటి వ్యక్తి ఎదుట ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అని మోహన్ బాబు వాపోయారు.
నా కారు ప్రమాదానికి కారణమిదే:
”మా” డైరీ ఆవిష్కరణలో రచ్చ జరిగింది. ”మా” లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ”మా” గురించి మంచి ఉంటే మైక్ లో చెప్పాలి.. చెడు ఉంటే చెవిలో చెప్పాలి అని చిరంజీవి సలహా ఇచ్చారు. దీంతో నటుడు రాజశేఖర్ వెంటనే స్టేజ్ పైకి వచ్చి మైక్ లాక్కుని మాట్లాడారు. ”మా” అసోసియేషన్ వల్లే కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. నా కారు ప్రమాదానికి ”మా” అసోసియేషన్ లో గొడవలే కారణం అన్నారు. ”మా” అసోసియేషన్ లో విభేదాలు దాచేస్తే దాగవని రాజశేఖర్ అన్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు, సుబ్బరామి రెడ్డి, జయసుధ.. రాజశేఖర్ కామెంట్స్ తో కంగుతిన్నారు. విస్మయానికి గురయ్యారు.
Also Read : చిరంజీవి కామెంట్స్‌తో అలిగి వెళ్లిపోయిన రాజశేఖర్!
Also Read : ‘మా’ గురించి మంచి ఉంటే మైక్‌లో.. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం: చిరంజీవి