Mana Shankara VaraPrasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. బాసు గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదుగా..

తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. (Mana Shankara VaraPrasad Garu)

Mana Shankara VaraPrasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. బాసు గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదుగా..

Mana Shankara VaraPrasad Garu

Updated On : October 2, 2025 / 6:18 PM IST

Mana Shankara VaraPrasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నయనతార, క్యాథరిన్ త్రెసా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తుండగా వెంకటేష్ గెస్ట్ రోల్ చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో దిగనుంది.

ఇటీవలే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచారు. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. మీసాల పిల్ల.. అని సాగనుంది ఈ పాట. ఈ పాటని భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో ఒకప్పుడు మెగాస్టార్ కి గంగూలీ సందులో గజ్జెల గోల, కైకలూరు కన్నెపిల్ల, వాన వాన.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఉదిత్ నారాయణ పాడటం గమనార్హం.

Also See : Raj Tarun : రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్ చూశారా? ‘చిరంజీవ’.. డైరెక్ట్ ఓటీటీలోకి..

మీరు కూడా మన శంకర వరప్రసాద్ గారు మొదటి సాంగ్ ప్రోమో వినేయండి..