Karur Rally: ఆ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. కరూర్ ర్యాలీ తొక్కిసలాటపై చిరంజీవి స్పందన

తమిళనాడులోని కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం(Karur Rally) తెలిసిందే. తమిళ హీరో విజయ్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది.

Karur Rally: ఆ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. కరూర్ ర్యాలీ తొక్కిసలాటపై చిరంజీవి స్పందన

Chiranjeevi responds to Tamil Nadu's Karur accident

Updated On : September 28, 2025 / 11:59 AM IST

Karur Rally: తమిళనాడులోని కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ హీరో విజయ్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది మరణించినట్టు సమాచారం.(Karur Rally) చాలా మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన పై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Lenin: అబ్బా సాయి రామ్.. హీరోయిన్ ని మార్చేశారు.. అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

“తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాట విషాదకరం. ఈ ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవితో పాటు చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.