Chiranjeevi : ఇది కదా మెగాస్టార్ అంటే.. సైలెంట్ గా మెగా సాయం.. రెండు కుటుంబాల్లో వెలుగులు..
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైలెంట్ గా ఇద్దరికి సాయం అందించి వారి ప్రాణాలు కాపాడారు. (Chiranjeevi)
Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఆయన సినిమాలతోనే మెగాస్టార్ అయిపోలేదు. ఎంతోమందికి సాయం చేసి కూడా మెగాస్టార్ అనిపించుకున్నారు. రక్తదానం, నేత్రదానం, కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, నిత్యావసర సరుకులు అందించి, ఎన్నో సార్లు స్వయంగా చాలా మంది పేద ఆర్టిస్టులకు వైద్యం చేయించి, డబ్బులు సాయం చేసి మంచి పేరు సంపాదించుకున్నారు చిరంజీవి.
బయటకు తెలిసినవే కాకుండా సైలెంట్ గా కూడా సినీ పరిశ్రమలో కష్టాలు పడే వాళ్లకు చిరంజీవి ఎపుడూ అండగా ఉంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైలెంట్ గా ఇద్దరికి సాయం అందించి వారి ప్రాణాలు కాపాడారు.
Also Read : Mohan Babu : బాబోయ్.. మోహన్ బాబునే భయపెడుతున్న మనవడు.. వీడియో వైరల్..
చిరంజీవి టీమ్ సమాచారం మేరకు.. ఎంతో కాలంగా సినిమా పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న శివనాథ్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్సకు సాయం కోసం చూస్తుండగా ఈ విషయం తెలిసిన చిరంజీవి శివనాథ్ చికిత్సకు దాదాపు 10.5 లక్షల భారీ మొత్తాన్ని అందించారట. అంతేకాక తన కుటుంబాన్ని పిలిచి మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అలాగే గతంలో తన దగ్గర మేనేజర్ గా పనిచేసిన నరసయ్య భార్యకు అత్యవసరంగా చికిత్స చేయాల్సి రావడంతో 9 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందించడమే కాక అపోలో వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ కి ఏర్పాట్లు చేశారట.
ఇలా గత వరం రోజుల్లోనే సైలెంట్ గా ఇద్దరికి ఇంత భారీ మొత్తం సాయం చేయడంతో మరోసారి ఫ్యాన్స్, నెటిజన్లు, టాలీవుడ్ జనాలు ఆయన్ని అభినందిస్తున్నారు. చిరంజీవి త్వరలో బాబీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఆయన నటించిన విశ్వంభర సినిమా ఆగస్టులో రాబోతుందని సమాచారం.
Also See : Neha Sharma : పంజాబ్ కింగ్స్ కి సపోర్ట్ చేస్తున్న చిరుత భామ.. స్టేడియంలో సందడి.. ఫొటోలు..
