Dhruva Natchathiram Trailer : పదేళ్లు లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా వస్తున్న ధ్రువ నక్షత్రం.. ట్రైలర్ అదుర్స్..

పదేళ్లు లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా ధ్రువ నక్షత్రం సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న గౌతమ్ మీనన్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

Dhruva Natchathiram Trailer : పదేళ్లు లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా వస్తున్న ధ్రువ నక్షత్రం.. ట్రైలర్ అదుర్స్..

Chiyaan Vikram Dhruva Natchathiram Chapter One Trailer

Updated On : October 24, 2023 / 6:34 PM IST

Dhruva Natchathiram Trailer : కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ 2013 హీరో సూర్యతో అనౌన్స్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధ్రువ నక్షత్రం’. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఈ సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడు. ఆ తరువాత విక్రమ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2016 లో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రాన్ని 2017 లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనేక కారణాలు వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు గౌతమ్ మీనన్.

ఇటీవల ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ తో ఓ ప్రోమోని రిలీజ్ చేసి ధ్రువ నక్షత్రం సినిమాని 24 నవంబర్ 2023న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఒక స్పై అండర్ కవర్ ఆపరేషన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్, రాధికా, సిమ్రాన్, అర్జున్ దాస్.. లాంటి పలువురు స్టార్స్ నటిస్తున్నారు. ట్రైలర్ యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో యాక్షన్ మూవీ లవర్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది.

Also read : Bhagavanth Kesari : పవన్ కళ్యాణ్‌కి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ ప్రత్యేక షో.. ఎందుకో తెలుసా..?

ఇక ట్రైలర్ కి యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది. కాగా ఈ సినిమాని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. చాప్టర్-1 ఈ నవంబర్ లో ఆడియన్స్ ని పలకరించబోతుంది. మరి ఇన్నాళ్లు సెట్స్ పైనే ఉన్న ఈ చిత్రం ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి. విక్రమ్ ఈ ఏడాది ఆల్రెడీ పొన్నియిన్ సెల్వన్ 2 తో సూపర్ హిట్టుని అందుకున్నాడు. ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగిస్తాడు లేదా చూడాలి. ఇక త్వరలో విక్రమ్ నుంచి ‘తంగలాన్’ అనే సినిమా కూడా రాబోతుంది.