సిండ్రెల్లా షాకిస్తుందిగా!
రాయ్ లక్ష్మీ బర్త్‌డే సందర్భంగా, ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ, సిండ్రెల్లా మోషన్ కీ విజువల్ పేరుతో ఒక తమిళ వీడియో రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

రాయ్ లక్ష్మీ బర్త్‌డే సందర్భంగా, ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ, సిండ్రెల్లా మోషన్ కీ విజువల్ పేరుతో ఒక తమిళ వీడియో రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
రాయ్ లక్ష్మీ మొయిన్ లీడ్‌గా నటించిన ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ ఇటీవల విడుదలైంది. అలా వచ్చి, ఇలా వెళ్లిపోయిందీ సినిమా.. తమిళ్‌లో ప్రస్తుతం ‘నియా-2’ (తెలుగులో నాగకన్య), ‘సిండ్రెల్లా’ సినిమాలు చేస్తుంది. నాగకన్య మే 24న విడుదల కానుంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన సిండ్రెల్లా ఫస్ట్‌లుక్‌కి రెస్పాన్స్ బాగుంది. ఇప్పుడు రాయ్ లక్ష్మీ బర్త్‌డే సందర్భంగా, ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ, సిండ్రెల్లా మోషన్ కీ విజువల్ పేరుతో ఒక తమిళ వీడియో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
ఫీమేల్ వాయిస్ ఓవర్ వినిపిస్తుండగా, హాల్లో ఉన్న రకరకాల ఫోటోలు చూపిస్తూ, వాటి మధ్యలో ఉన్న రాయ్ లక్ష్మీ ఫోటోని చూపించడం, ఆమె సడెన్‌గా దయ్యంలా మారిపోవడం చూస్తే భయం వేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సిండ్రెల్లా చిత్రాన్ని వినూ వెంకటేష్ డైరెక్ట్ చేస్తుండగా, SSI ప్రొడక్షన్ బ్యానర్‌పై, సుబ్బయ్య షణ్ముగం నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ : రమ్మీ, ఎడిటింగ్ : లారెన్స్ కిషోర్, మ్యూజిక్ : అశ్వామిత్ర, కొరియోగ్రఫీ : సుజయ్ శ్రీనివాస్, డైలాగ్స్ : సుకుమారన్ గోపాల్, స్టంట్ : హరి దినేష్.