Anil Ravipudi – CM Chandrababu : సీఎం చంద్రబాబునే పడీ పడీ నవ్వించిన అనిల్ రావిపూడి.. బాలయ్య ఈవెంట్లో..

అనిల్ రావిపూడి మాటలకు సీఎం చంద్రబాబు నాయుడు పడీ పడీ నవ్వారు.

Anil Ravipudi – CM Chandrababu : సీఎం చంద్రబాబునే పడీ పడీ నవ్వించిన అనిల్ రావిపూడి.. బాలయ్య ఈవెంట్లో..

CM Chandrababu Naidu Full Laugh for Anil Ravipudi Comments in Balakrishna Event

Updated On : February 4, 2025 / 2:50 PM IST

Anil Ravipudi – CM Chandrababu : అనిల్ రావిపూడి తన సినిమాలతో ప్రేక్షకులను నవ్విస్తారని తెలిసిందే. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించి భారీ హిట్ కొట్టారు. అయితే తాజాగా అనిల్ రావిపూడి తన మాటలతో సీఎం చంద్రబాబుని కూడా నవ్వించారు. ఇటీవల బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

బాలయ్యకు పద్మ భూషణ్ రావడంతో అంతా సంతోషం వ్యక్తం చేసారు. అభిమానులు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు భార్య, బాలకృష్ణ చెల్లి నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు వచ్చినందుకు స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో నారా – నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ పార్టీకి బాలయ్య సన్నిహితులు సినీ పరిశ్రమకు చెందిన పలువురు డైరెక్టర్స్ కూడా వచ్చారు.

Also Read : Samantha : వాళ్ళ కంటే నాకు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు.. నేను మాత్రం అలా చేయను.. సమంత సంచలన వ్యాఖ్యలు..

అయితే ఈ పార్టీలో పలువురు స్టేజిపై కూడా మాట్లాడారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ అప్పటిదాకా జరిగిన ఈవెంట్లో ఆసక్తికర విషయాలను తెలిపాడు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నారా లోకేష్ బాబు కట్టుకున్న భార్య ముందు అమ్మ వంట గొప్పది అని చెప్పారు. ఏం గుండె సార్ మీది. బాలయ్య గారిని వసుంధర గారి ముందు ఐ లవ్ యు చెప్పమంటే ఎవరికి చెప్పాలి అని అడిగారు ఏం గుండె బాబు మీది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మేము ఓ రేంజ్ లో చూస్తాము. ఆయన్ని భువనమ్మ గారు పై నుంచి ఏమండీ ఒకసారి పైకి రండి అంటే ఆయన అలా సామాన్యుడిలా పైకి వచ్చారు. పైగా భువనమ్మ గారు టైం లిమిట్ ఇచ్చారు ఇది రాజకీయ సభ కాదు అయిదు నిమిషాలే మాట్లాడాలి అని ఈ ఇన్సిడెంట్ చూసాక నేను, బాబీ అనుకున్నాము మేము భార్యలతో రాలేదు బతికిపోయాం అని సరదాగా అన్నాడు.

Also Read : Game Changer : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

దీంతో అనిల్ రావిపూడి మాటలకు చంద్రబాబు నాయుడు పడీ పడీ నవ్వారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. చంద్రబాబు సంతోషంగా ఫుల్ గా నవ్వుతున్న వీడియోలను చూసి తెలుగుదేశం కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ ని సినిమాలతోనే కాదు మాటలతో కూడా నవ్విస్తున్నావు, ఏకంగా సీఎంనే నవ్వించావుగా అని కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..

ఇక ఈ ఈవెంట్లో బాలయ్య, సీఎం చంద్రబాబు.. అనేకమంది మాట్లాడారు. నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి కలిసి బాలయ్యని సరదాగా ఇంటర్వ్యూ కూడా చేసారు.