Comedian Ali : కమెడియన్ అలీ ఇంటి నుంచి రాబోతున్న హీరో.. ప్రణయ గోదారి అంటూ..
కమెడియన్ అలీ సోదరుని తనయుడు సదన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Comedian Ali Brothers Son Sadan entry as Hero with Pranaya Godari Movie
Comedian Ali : ఎన్నో సినిమాలతో తన కామెడీతో మెప్పించాడు అలీ. ఆ తర్వాత అలీ తమ్ముడు ఖుయ్యుమ్ కూడా పలు సినిమాలతో మెప్పించాడు. ఇప్పుడు కమీడియన్ అలీ ఇంటి నుంచి హీరో రాబోతున్నాడు. కమెడియన్ అలీ సోదరుని తనయుడు సదన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా పిఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్ పై పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో PL విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రణయ గోదారి’. తాజాగా ఈ ప్రణయ గోదారి సినిమా టైటిల్ లుక్‌ను ప్రముఖ సంఘ సేవకులు అంబర్ పేట్ శంకరన్న ఆవిష్కరించారు.
Also Read : Paarijatha Parvam : ఆహా ఓటీటీలోకి వచ్చేసిన పారిజాత పర్వం..
ఈ సందర్భంగా అంబర్ పేట్ శంకర్ మాట్లాడుతూ.. చిన్న సినిమాలకు అండగా నిలవాలి. చిన్న సినిమా అయినప్పటికీ మంచి కంటెంట్ తో వస్తున్న ప్రణయ గోదావరి సినిమా మంచి హిట్ అవ్వాలి, నిర్మాతకు బాగా డబ్బులు రావాలి అని అన్నారు. నిర్మాత పారమళ్ళ లింగయ్య మాట్లాడుతూ.. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తాం అని తెలిపారు. ఇక ఈ సినిమాలో సాయికుమార్, పృథ్వి, జబర్దస్త్ రాజమౌళి.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.