Sunday Girlfriend : ‘సండే గర్ల్ ఫ్రెండ్’తో రాబోతున్న కమెడియన్ అలీ.. టైటిలే విచిత్రంగా ఉందే..
తాజాగా నేడు ఈ సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Comedian ali new Movie Sunday Girlfriend Opening with Pooja Ceremony
Sunday Girlfriend : ఎన్నో సినిమాలతో మనల్ని మెప్పించిన కమెడియన్ అలీ ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అలీ మరో కొత్త సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా టైటిల్ కూడా ఆసక్తిగా ఉంది. కామ్నా శర్మ, సుమన్, అలీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘సండే గర్ల్ ఫ్రెండ్’. లార్విన్ మూవీస్ బ్యానర్ లో గడ్డం వెంకటరమణ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా నేడు ఈ సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సుమన్, ఇంద్రజ, అలీ.. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా ఓపెనింగ్ లో ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టగా, సుమన్ స్క్రిప్ట్ అందచేయగా ఇంద్రజ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Also Read : Ramnagar Bunny : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ‘రామ్ నగర్ బన్నీ’ టీజర్ వచ్చేసింది..
ఈ సందర్భంగా డైరెక్టర్ గడ్డం వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను సీఎం పెళ్లాం అనే సినిమాను తీస్తున్నాను. అది రాజకీయ నేపథ్యంతో మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉండబోతుంది. ఆ సినిమా తర్వాత ఈ సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా తీయబోతున్నాను. లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది అని తెలిపారు.