Harsha Chemudu : వామ్మో.. అన్ని లక్షలు పెట్టి బైక్ కొన్న వైవా హర్ష.. ఫొటోస్ చూసారా..

ప్రముఖ కమెడియన్ వైవా హర్ష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన కామెడీ టైమింగ్, కామెడీ స్టైల్ తో తెలుగు ప్రేక్షకుల్లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు.

Harsha Chemudu : వామ్మో.. అన్ని లక్షలు పెట్టి బైక్ కొన్న వైవా హర్ష.. ఫొటోస్ చూసారా..

Viva Harsha bought a news bike with all lakhs photos goes viral

Updated On : December 1, 2024 / 6:11 PM IST

Harsha Chemudu : ప్రముఖ కమెడియన్ వైవా హర్ష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన కామెడీ టైమింగ్, కామెడీ స్టైల్ తో తెలుగు ప్రేక్షకుల్లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట వైవా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా వైవా హర్షగా పేరుతెచ్చుకున్నాడు. అలా పలు సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. అలాగే ఇటీవల హీరోగా కూడా పరిచయమవుతూ సుందరం మాస్టర్ సినిమా చేసాడు.

Also read : Fahadh Faasil : ఆ సినిమా ఎందుకు చేశానా అని బాధపడ్డా.. పుష్ప నటుడు కామెంట్స్..

అయితే తాజాగా ఈ నటుడు ఓ సరికొత్త బైక్ కొన్నాడు. అది కూడా స్పోర్ట్స్ బైక్. సుజుకి హయబుసా1300 మోడల్ బైక్ ఇది.
ఈ బైక్ ధర దాదాపుగా 15 లక్షలు ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ బైక్ ను తన భార్య అక్షర చేతుల మీదుగా స్టార్ట్ చేయించాడు హర్ష. అయితే ఇది తన డ్రీమ్ బైక్ కావడంతో ఈ బైక్ ను వేరే దేశం నుండి తెప్పించుకున్నాడట. అందులోనూ హర్ష బైక్ రేసింగ్ చేస్తాడు. అందుకే ఈ బైక్స్ అంటే తనకి బాగా ఇష్టమట.

తన డ్రీమ్ బైక్ కొనడంతో ఓ స్పెషల్ వీడియో కూడా షేర్ చేసాడు.. “ఒక హాఫ్ డే గ్యాప్ లో బైక్ డెలివరీ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. దీనికోసం ఎంతో ఎదురుచూసా.. మీ అందరి ప్రేమ, సపోర్ట్ లేకపోతే ఇది జరిగేది కాదు. మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అని ఆ బైక్ కి ముద్దుపెడుతూ”.. ఎమోషనల్ అయ్యాడు.

నిజానికి హర్షకి బైక్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే హర్ష దగ్గర రేసింగ్ కి సంబందించిన బైక్స్ చాలానే ఉన్నాయట. ఇప్పుడు ఈ బైక్ కూడా కొన్నాడు. ఇక ఈ విషయాన్ని ఆయన స్వయంగా పలు ఇంటర్వూస్ లో కూడా తెలిపారు. దీంతో ఆయన కొత్త బైక్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Harsha (@harshachemudu)