Pawan Kalyan Corona : పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. పవన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Pawan Kalyan Corona : పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

Pawan Kalyan Tested Corona Positive

Updated On : April 16, 2021 / 5:16 PM IST

Corona positive for Pawan Kalyan : జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. పవన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తన వ్యవసాయం క్షేత్రంలో పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్న పవన్ కు తాజాగా పాజిటివ్‌గా తేలింది.

జ్వరం, ఒళ్లునొప్పులు, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడంతో పవన్‌ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఆయనకు వైద్యులు వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స అందిస్తున్నారు. యాంటివైరల్‌ మందులతో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు.

ఈ నెల 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని.. హైదరాబాద్‌ చేరుకున్న తరువాత.. కాస్త నలతగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే అప్పుడు ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. అయితే వైద్యుల సలహాతో క్వారంటైన్‌లోకి వెళ్లారు జనసేనాని. తిరుపతి ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు.

అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయంటున్నారు పవన్‌ సన్నిహితులు. రెండు రోజుల క్రితం మరోసారి కోవిడ్‌ టెస్టు చేయించడంతో.. ఆయనకు ఈసారి పాజిటివ్‌గా తేలింది. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడంతో.. యాంటివైరల్‌ మందులతో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత మూవీ యూనిట్‌లో ఒక్కొక్కరుగా కరోనా బారిన పడ్డారు. అయన వ్యక్తిగత సిబ్బందిలో కొంత మందికి కోవిడ్ సోకడంతో క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇప్పుడు పాజిటివ్‌గా తేలడంతో.. పవన్ తన ఫామ్ హౌజ్‌లో చికిత్స పొందుతున్నారు.