శ్రీరామునిపై అసభ్యకర పోస్టులు.. కత్తి మహేష్ అరెస్ట్..

టాలీవుడ్ వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్‌లు చేసినందకుగాను పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు కత్తి మహేష్‌కు రిమాండ్ విధించింది. కాగా, కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో కత్తి మహేష్ శ్రీరాముడి గురించి అసభ్యకర పోస్ట్‌లు పెట్టారు. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హిందూ సంఘాలు పలు చోట్ల కేసులు పెట్టాయి.
వారి ఫిర్యాదుల ఆధారంగా సైబైర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కత్తి మహేష్‌ను విచారించారు. తాజాగా మరోసారి విచారించిన పోలీసులు.. విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు.