ఎర్రోడి వీరగాథ : బాలయ్యను వదలా అంటున్న నాగబాబు
తెలుగు ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో బాలకృష్ణ,నాగబాబు మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పెద్దదవుతోంది.

తెలుగు ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో బాలకృష్ణ,నాగబాబు మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పెద్దదవుతోంది.
తెలుగు ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో బాలకృష్ణ, నాగబాబు మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పెద్దదవుతోంది. గతంలో బాలకృష్ణ చిరంజీవి పవన్ కళ్యాణ్ లపై చేసిన కామెంట్లకు కౌంటరిస్తూ తన వ్యాఖ్యానంతో ఇటీవల నాగబాబు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. ఐతే తాజాగా విడుదల చేసిన వీడియోలో ఏకంగా కొంత పార్ట్ షార్ట్ ఫిలీం లాగా షూట్ చేసి విడుదల చేయటంతో నందమూరి అభిమానుల ఫైర్ అవుతున్నారు.
నాగబాబు విడుదల చేసిన వీడియోలో “ఎర్రోడి వీరగాధ” కొందరు ఆడవాళ్లు ఒకవ్యక్తిని చితక బాదుతూ ఉంటారు. కారులో వెళుతూ ఆ సీన్ చూసి మన కెందుకులే అని ముందుకు వెళ్లిపోతాడు. మళ్లీ కొంత ముందుకు వెళ్ళాక మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుంది. వెంటనే కారు దిగిన నాగబాబు, అతడ్ని ఆడవారి బారినుంచి రక్షించి, నిన్ను ఎందుకు కొడుతున్నారని ఆ వ్యక్తిని అడుగుతాడు.
నేనేం తప్పుచేయలేదు సార్ పెద్దలమాట ఫాలో అయ్యానని చెపుతాడు ఆ వ్యక్తి. ఏంటా మాటని నాగబాబు అడిగితే…..”ఆడపిల్ల కనపడితే ముద్దన్నా పెట్టాలి, కడుపన్నాచేయాలి అని పెద్దలు చెప్పిన మాటను ఫాలో అయ్యానంటాడు ఆ వ్యక్తి. దానికి కోపం వచ్చిన నాగబాబు ఆ వ్యక్తిని మళ్లీ మహిళలకు అప్పగించి కారెక్కి వెళ్లి పోతాడు. వీడియోలో దెబ్బలు తినే వ్యక్తి చేత చెప్పించిన పెద్దలమాట గతంలో బాలకృష్ణ ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు. నాగబాబు విడుదల చేసిన ఈ వీడియో ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.