KJQ Teaser : ‘దసరా’ మూవీ డైరెక్టర్ తమ్ముడు.. హీరోగా కొత్త సినిమా.. ఇంటరెస్టింగ్ కట్‌తో టీజర్ అదుర్స్..

'దసరా' మూవీ డైరెక్టర్ తమ్ముడు హీరోగా కొత్త సినిమా. 'KJQ' అనే టైటిల్ తో ఇంటరెస్టింగా టీజర్.

KJQ Teaser : ‘దసరా’ మూవీ డైరెక్టర్ తమ్ముడు.. హీరోగా కొత్త సినిమా.. ఇంటరెస్టింగ్ కట్‌తో టీజర్ అదుర్స్..

Dasara Movie Director Srikanth Odela brother as actor with Dheekshith Shetty in KJQ Teaser

Updated On : February 20, 2024 / 4:42 PM IST

KJQ Title Teaser : టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ తమ టేకింగ్ స్టైల్ తో ఆడియన్స్ ని ఆకట్టుకొని సూపర్ సక్సెస్ ని అందుకుంటున్నారు. ఈక్రమంలోనే గత ఏడాది పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తూ డెబ్యూట్ ఇచ్చిన దర్శకుడు ‘శ్రీకాంత్ ఓదెల’. నేచురల్ స్టార్ నానితో ‘దసరా’ సినిమా తెరకెక్కించి.. మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్క్ ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు నాని కూడా మొదటి వంద కోట్ల సినిమా ఇచ్చారు.

ఇప్పుడు ఈ దర్శకుడు తమ్ముడు వంతు వచ్చింది. ‘KJQ’ అనే సినిమాతో శ్రీకాంత్ ఓదెల బ్రదర్ ‘శశి ఓదెల’ నటుడిగా పరిచయం అవ్వబోతున్నారు. దసరా సినిమా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోగా ‘దీక్షిత్ శెట్టి’ నటిస్తున్నారు. దసరా మూవీలో నానితో పాటు సెకండ్ హీరోగా నటించిన దీక్షిత్.. తన నటనతో ఆడియన్స్ నుంచి మంచి మార్కులు అందుకున్నారు.

Also read : HanuMan : హనుమాన్ మూవీ మోస్ట్ అవైటెడ్ సాంగ్.. ‘రఘునందన్’ ఆడియో వచ్చేసింది..

ఇక దీక్షిత్ తో పాటు శశి సెకండ్ హీరోగా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది. హీరోయిన్ గా ‘యుక్తి తరేజా’ నటిస్తున్నారు. రంగబలి సినిమాలో హీరోయిన్ గా నటించిన యుక్తి.. తన అందంతో తెలుగు అబ్బాయిలని బాగానే ఆకట్టుకున్నారు. కాగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. KJQ టైటిల్ తో కింగ్, జాకీ, క్వీన్ అనే ట్యాగ్ లైన్ తో ఇంటరెస్టింగ్ ఉంది.

టీజర్ చూస్తుంటే.. కింగ్ (దీక్షిత్), జాకీ (శశి), క్వీన్ (యుక్తి) మధ్య సాగే ఒక గ్యాంబ్లింగ్, రాబరీ కథనంతో మూవీ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. కేకే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నారు. మరి తమ్ముడు శశి నటుడిగా ఆకట్టుకుంటాడా లేదా చూడాలి.