Robinhood : ‘డేవిడ్ వార్నర్’ గెస్ట్ గా ‘రాబిన్ హుడ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ కూడా పాల్గొంటారు అని ఇటీవల నిర్మాతలు తెలిపారు.

David Warner as Guest for Nithiin Robinhood Pre Release Event Details Date Time Venue Details Here
Robinhood : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ తో తెలుగు వారికి బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల సాంగ్స్, డైలాగ్స్ రీల్స్ చేస్తూ, ఇక్కడి పండగలు సెలబ్రేట్ చేసుకుంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఏదో ఒక రోజు తెలుగు సినిమాల్లో డేవిడ్ వార్నర్ నటిస్తాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే డేవిడ్ వార్నర్ నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ నటిస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ కూడా పాల్గొంటారు అని ఇటీవల నిర్మాతలు తెలిపారు. రాబిన్ హుడ్ సినిమా మార్చ్ 28న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్రకటించారు.
రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు మార్చ్ 23న హైదరాబాద్ లోని HICC నోవాటెల్ లో సాయంత్రం 5 గంటల నుంచి జరగనుంది అని ప్రకటించారు. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా డేవిడ్ వార్నర్ రాబోతున్నాడు. దీంతో వార్నర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈవెంట్లో వార్నర్ ఏం మాట్లాడతాడో, ఏం డైలాగ్స్ చెప్తారో అని ఎదురుచూస్తున్నారు తెలుగు క్రికెట్, సినిమా ఫ్యాన్స్.