Movie Piracy : సినిమాలు పైరసీ చేసి.. డబ్బుల్ని క్రిప్టో కరెన్సీలో.. పైరసీ కేసులో అరెస్ట్ పై డీసీపీ దారా కవిత కామెంట్స్..

తాజాగా ఈ విషయంపై డీసీపీ దారా కవిత నేడు 10 టీవీతో మాట్లాడారు.

Movie Piracy : సినిమాలు పైరసీ చేసి.. డబ్బుల్ని క్రిప్టో కరెన్సీలో.. పైరసీ కేసులో అరెస్ట్ పై డీసీపీ దారా కవిత కామెంట్స్..

DCP Dara Kavitha Comments Arrested a Person in Movie Piracy

Updated On : July 4, 2025 / 6:32 PM IST

Movie Piracy : ఇటీవల సినీ పరిశ్రమలో పైరసీ ఎఫెక్ట్ మరింత ఎక్కువైంది. పైరసీ వల్ల టాలీవుడ్ కి కోట్లల్లో నష్టం చేకూరుతుంది. ఈ పైరసీ విషయంలో తాజాగా పోలీసులు ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేసారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినిమాలను పైరసీ చేస్తున్న తూర్పు గోదావరికి చెందిన జన కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. తాజాగా ఈ విషయంపై డీసీపీ దారా కవిత నేడు 10 టీవీతో మాట్లాడారు.

డీసీపీ దారా కవిత మాట్లాడుతూ.. టాలీవుడ్ సినిమాలు పైరసీ చేసే నిందితుడు కిరణ్ ను అరెస్ట్ చేశాము. ఇప్పటి వరకు 40 పెద్ద సినిమాలను పైరసీ చేశాడు. గత ఆరేళ్లుగా పైరసీ చేస్తున్నాడు. ఇప్పటివరకు 40 లక్షలకి పైగా పైరసీ నుంచి సంపాదించినట్లు తెలుస్తుంది. అత్తాపూర్ లోని సినీ పోలీస్ థియేటర్ లో పైరసీ చేసినట్లు గుర్తించాము. విదేశాల్లో ఉన్న వెబ్ సైట్ లకు పైరసీ సినిమాలు అమ్మి క్రిప్టో ద్వారా డబ్బులు తీసుకున్నాడు. 40 పెద్ద సినిమాల పైరసీ తో సినీ పరిశ్రమకు 3700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. గతంలో కామ్ కార్డ్ ద్వారా కూడా సినిమాలను పైరసీ చేసాడు. ఈ సినిమాలను వన్ తమిళ్ mv, మూవీ రూల్స్ వెబ్ సైట్ లకు అమ్ముతున్నట్లు గుర్తించాము. ఒక్కొక్క సినిమాకి 400 కిప్టో కరెన్సీని తీసుకుంటున్నాడు. క్రిప్టోతో పాటు బిట్ కాయిన్స్ రూపంలో కూడా తీసుకుంటున్నాడు. వాటిని ఇండియన్ కరెన్సీకి మార్చుకుంటున్నాడు. ఇటీవల రిలీజయిన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ చేంజర్ తండేల్, రాజధాని.. పలు సినిమాల ఫైల్స్ ని అతని దగ్గర స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు.

Also Read : Solo Boy : ‘సోలో బాయ్’ మూవీ రివ్యూ.. బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ సినిమా ఎలా ఉంది?

అయితే.. తన ఆర్ధిక పరిస్థితి బాగాలేక ఫైరసి చేస్తున్నాను అని నిందితుడు కిరణ్ తెలిపినట్టు, నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని, వెబ్సైటు కు సైతం నోటీసులు జారీ చేస్తామని, పైరసీకి ఎవ్వరు పాల్పడినా ఉపేక్షించేది లేదని, సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు.