Project K launch : ప్రాజెక్ట్ K లాంఛ్ ఈవెంట్‌కు వెళ్ల‌ని దీపికా ప‌దుకొనే.. అస‌లు కార‌ణం ఇదే..!

ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కామిక్-కాన్‌ ఈవెంట్‌లో ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నుండ‌గా దీపికా ప‌దుకొనే మాత్రం వెళ్ల‌డం లేదు.

Project K launch : ప్రాజెక్ట్  K లాంఛ్ ఈవెంట్‌కు వెళ్ల‌ని దీపికా ప‌దుకొనే.. అస‌లు కార‌ణం ఇదే..!

Deepika Padukone to skip Project K launch

Project K launch-Deepika Padukone : ప్ర‌భాస్ (Prabhas) హీరోగా న‌టిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K (Project K). నాగ్ అశ్విన్ (Nag Ashwin) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే(Deepika Padukone) హీరోయిన్‌గా న‌టిస్తోంది. బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan), లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan), దిశా ప‌టాని (Disha Patani) లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్ పై దాదాపు రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొద‌టి భాగం 12 జ‌న‌వ‌రి 2024న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్-కాన్‌లో ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ఇప్ప‌టికే తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలో ఈ ఈవెంట్ కోసం ప్ర‌భాస్‌, రానా, క‌మ‌ల్ హాస‌న్‌లు ఇప్ప‌టికే అక్క‌డికి చేరుకున్నారు. అయితే.. హీరోయిన్ దీపికా ప‌దుకొనే మాత్రం వెళ్ల‌లేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఏంటంటే హాలీవుడ్‌లో న‌డుస్తున్న స‌మ్మె.

Bigg Boss 7 : బిగ్‌బాస్ 7లో కంటెస్టెంట్‌గా టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్‌.. తెలుగు ఆట‌గాడే.. నిజ‌మెంత‌..?

అదేంటీ హాలీవుడ్ స‌మ్మెకు దీపిక‌కు సంబంధం ఏమిట‌ని అంటారా..? సమ్మె చేస్తున్న స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్- అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ (SAG-AFTRA)లో దీపిక ప‌దుకునే సభ్యురాలు కావ‌డ‌మే. స‌మ్మె జ‌రుగుతుండ‌డంతో న‌టీన‌టులు ఏదైనా ఈ వెంట్‌కు ప్ర‌చార లేదా ప్ర‌చార సేవ‌ల‌ను అందించ‌రాద‌ని యూనియ‌న్ పేర్కొంది. దీంతో ప్రాజెక్ట్ K గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు దీపిక హాజ‌రు కావ‌డం లేదు.

2017లో దీపిక హాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. విన్ డీజిల్‌తో క‌లిసి ‘ట్రిపుల్ ఎక్స్’ మూవీలో న‌టించింది. ఈ స‌మ‌యంలోనే SAG-AFTRAలో దీపిక స‌భ్య‌త్వం తీసుకుంది. మరో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా సైతం సమ్మెకు తన మద్దతు తెలిసిన సంగ‌తి తెలిసిందే.

Eesha Rebba : అభిమానుల‌కు షాక్ ఇచ్చిన హీరోయిన్ ఈషా రెబ్బా.. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు.. తండ్రి ఎక్క‌డంటే..?