Devil Movie: 500 మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తోన్న డెవిల్
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. ఏకంగా 500 మందితో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

Devil Movie Huge Action Sequence With 500 People
Devil Movie: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘అమిగోస్’ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో, ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకోవాలని కళ్యాణ్ రామ్ ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ఓ స్పై పాత్రలో నటిస్తున్నాడు.
Ugadi : ఉగాది అప్డేట్స్, స్పెషల్ పోస్టర్స్ తో కళకళలాడిన టాలీవుడ్..
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లుగా వారు తెలిపారు. ఏకంగా 500 మందితో ఈ భారీ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ హై ఆక్టేన్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని ఫైట్ మాస్టర్ వెంకట్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ టాలీవుడ్‌లో బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఒకటిగా నిలవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Kalyan Ram: కీలక షెడ్యూల్‌ను ముగించేసిన కళ్యాణ్ రామ్ ‘డెవిల్’!
కళ్యాణ్ రామ్ సరికొత్త గెటప్‌లో నటిస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు శ్రీకాంత్ విస్సా అందిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామలు సంయుక్తా మీనన్, మాళవికా నాయర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తుండగా, అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.