Dhanush : సూపర్ హిట్ కాంబినేషన్‌తో ధనుష్ బాలీవుడ్ మూవీ.. ఆ మూవీకి సీక్వెల్..?

తమిళ్ స్టార్ హీరో ధనుష్ బాలీవుడ్ లో తన కొత్త సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశాడు. టైటిల్ టీజర్ చూస్తుంటే.. ఈ సినిమా ఇంతకుముందు సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అని తెలుస్తుంది.

Dhanush : సూపర్ హిట్ కాంబినేషన్‌తో ధనుష్ బాలీవుడ్ మూవీ.. ఆ మూవీకి సీక్వెల్..?

Dhanush Bollywood movie titled as Tere Ishk Mein From The World Of Raanjhanaa

Dhanush : తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన నటనతో.. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతి ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ రియల్ గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నాడు. ఈ హీరో 2013 లో బాలీవుడ్ లో పరిచయం అవుతూ చేసిన సినిమా ‘రంజానా’ (Raanjhanaa). లవ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తరువాత ధనుష్.. ఇదే దర్శకుడితో 2021లో ఆత్రంగి రే (Atrangi Re) రొమాంటిక్ ఫాంటసీ డ్రామాలో నటించాడు.

Chinmayi Sripaada : సింగ‌ర్ చిన్మ‌యి శ్రీపాద క‌వ‌ల పిల్ల‌ల‌ను చూశారా..? ఎంత అందంగా ఉన్నారో

ఇప్పుడు మూడోసారి ఎల్ రాయ్ దర్శకత్వంలో ధనుష్ మరో సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishk Mein) అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఈ వీడియో చూస్తుంటే.. ఈ మూవీ రంజానాకి సీక్వెల్ అని తెలుస్తుంది. రంజానా మూవీలోని ధనుష్ పాత్ర పేరుతోనే టీజర్ లోని డైలాగ్స్ ఉండడం, అలాగే టీజర్ ఎండ్ లో ‘From The World Of Raanjhanaa’ అని చూపించడంతో సీక్వెల్ అని తెలుస్తుంది.

Minister Roja : రామ్‌చరణ్ కూతురు పై మంత్రి రోజా ఎమోషనల్ ట్వీట్.. చరణ్‌ని చిన్నప్పుడు ఎత్తుకున్న..

రంజానా మూవీలో ధనుష్ పాత్ర చివరికి చనిపోతుంది. కానీ ధనుష్ చనిపోయినట్లు ఎక్కడా చూపించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తుంది. రంజానాకి సంగీతం అందించిన ఎ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. కాగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సూపర్ హిట్స్ ఉండడంతో ఈ చిత్రం పై ప్రకటనతోనే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.