Kewal : ‘ఢీ’ కంటెస్టంట్ కేవల్ కన్నుమూత.. ఎమోషనల్ అయిన యశ్ మాస్టర్..

‘ఢీ’ కంటెస్టెంట్, యశ్ మాస్టర్ అసిస్టెంట్ కేవల్ కన్నుమూశాడు..

Kewal : ‘ఢీ’ కంటెస్టంట్ కేవల్ కన్నుమూత.. ఎమోషనల్ అయిన యశ్ మాస్టర్..

Kewal

Updated On : September 20, 2021 / 4:27 PM IST

Kewal: తెలుగు రియాలిటీ షోలలో ‘ఢీ’ షోకి ఉన్న క్రేజ్ వేరు. ఎంతోమంది టాలెంటెడ్ డ్యాన్సర్స్ ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. అలాగే డ్యాన్సర్స్‌గా ఎంట్రీ ఇచ్చి కొరియోగ్రాఫర్స్ అయిన వాళ్లూ ఉన్నారు. ఇప్పుడు ‘ఢీ’ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది.

Adivi Sesh : అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన టాలీవుడ్ నటుడు అడివి శేష్..

ముఖ్యంగా వ్యక్తిగతంగా యంగ్ కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్‌కిది తీరని లోటు అనే చెప్పాలి. ఎందుకుంటే ‘ఢీ’ లో యశ్ మాస్టర్ టీంలో కంటెస్టంట్‌గా అలాగే కొద్ది కాలం యశ్ మాస్టర్ అసిస్టెంట్‌గా కూడా పని చేసిన కేవల్ కన్నుమూశాడు. కేవల్ కొద్దికాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. అతడిని బతికించడానికి అవసరమైన బ్లడ్ అందిచండి.. అందరూ సాయం చెయ్యండని యశ్‌తో ‘ఢీ’ కంటెస్టంట్స్ అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.

నాగ్‌ అరుదైన రికార్డ్‌.. సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు

సరైన వైద్యం అందక ఆరోగ్యం విషమించడంతో కేవల్ మరణించాడు. తన అసిస్టెంట్ కోసం యశ్ మాస్టర్ కూడా ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను.. ఈ బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.. చాలా తర్వగా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావ్ అంటూ.. హాస్పిటల్‌లో కేవల్‌తో తీసుకున్న సెల్ఫీని షేర్ చేస్తూ భావేద్వేగభరితమైన పోస్ట్ చేశారు యశ్ మాస్టర్..

 

View this post on Instagram

 

A post shared by Yashwanth Master (@yashwanthmaster)