Chaitanya Master Mother : మీరే నాకు తలకొరివి పెట్టాలి.. చైతన్య మాస్టర్ తల్లి ఆవేదన.. ఢీ స్టేజిపై ఏడుస్తూ..

తాజాగా మరోసారి చైతన్య మాస్టర్ ని గుర్తుచేస్తూ ఆయన చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ని మళ్ళీ చేసారు.

Chaitanya Master Mother : మీరే నాకు తలకొరివి పెట్టాలి.. చైతన్య మాస్టర్ తల్లి ఆవేదన.. ఢీ స్టేజిపై ఏడుస్తూ..

Dhee Show Chaitanya Master Mother Emotional while Remembering him Promo goes Viral

Updated On : July 1, 2024 / 8:30 AM IST

Chaitanya Master Mother : డ్యాన్స్ షో ఢీ ద్వారా కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్య మాస్టర్. తనదైన స్టైల్ లో కామెడీ మిక్స్ చేసి కొత్తరకంగా డ్యాన్స్ చేసి అందర్నీ మెప్పించేవాడు చైతన్య మాస్టర్. అయితే గత సంవత్సరం చైతన్య మాస్టర్ నెల్లూరులో ఈవెంట్ కి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుల బాధల వల్లే, ఆ అప్పులు తీర్చేలేకే, ఒత్తిడి ఎక్కువయ్యే చనిపోతున్నట్టు చైతన్య మాస్టర్ ఆత్మహత్య ముందు ఓ వీడియో రిలీజ్ చేసాడు.

చైతన్య మాస్టర్ మరణం డ్యాన్సర్లని, డ్యాన్స్ మాస్టర్స్ ని కలిచివేసింది. ఎంతోమంది డ్యాన్సర్లు విషాదంలో మునిగారు. గతంలో ఢీ షోలో చైతన్య మాస్టర్ ని గుర్తుచేసుకుంటూ స్పెషల్ పర్ఫార్మెన్స్ లు చేసారు. తాజాగా మరోసారి చైతన్య మాస్టర్ ని గుర్తుచేస్తూ ఆయన చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ని మళ్ళీ చేసారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు.

Also Read : Darshan : దర్శన్ మర్డర్ కేసుపై సినిమాలు.. టైటిల్స్ చూశారా?

అయితే ఈ సారి చైతన్య మాస్టర్ తండ్రి వెంకట సుబ్బారావు చైతన్యలాగా తయారయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసారు. దీంతో అందరూ చైతన్యని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ షోకి చైతన్య మాస్టర్ తల్లి లక్ష్మి రాజ్యం కూడా వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. వీళ్లంతా నా కొడుకులే. రేపు నేను చనిపోతే వస్తారా? నన్ను మోస్తారా? మీరే నన్ను మోయాలి. మీరే నాకు తలకొరివి పెట్టాలి. ఇదే నా కోరిక. ఎందుకంటే నాకు నా కొడుకు లేడు కాబట్టి అంటూ ఏడ్చేసింది. దీంతో షోలో ఉన్న వాళ్లంతా కూడా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

https://www.youtube.com/watch?v=lcFdQUdgpt4