Prabhas – Yash : ప్రభాస్, యశ్‌తో సినిమాలు కన్ఫార్మ్ చేసిన దిల్ రాజు.. డ్రీం ప్రాజెక్ట్ జటాయు!

దిల్ రాజు నిర్మాతగా కెరీర్ మొదలు పెట్టి 20 ఏళ్ళు పూర్తి అవ్వడంతో ట్విట్టర్ లో నెటిజెన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ వచ్చాడు.

Prabhas – Yash : ప్రభాస్, యశ్‌తో సినిమాలు కన్ఫార్మ్ చేసిన దిల్ రాజు.. డ్రీం ప్రాజెక్ట్ జటాయు!

dil raju confirms films with Prabhas Yash pawan kalyan chiranjeevi

Updated On : April 5, 2023 / 6:01 PM IST

Prabhas – Yash : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టి 20 ఏళ్ళు పూర్తి అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టిన దిల్ రాజు.. 2003 లో వచ్చిన దిల్ (Dil) సినిమాతో ప్రొడ్యూసర్ గా పరిచయం అయ్యాడు. నితిన్ (Nithiin) హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2003 ఏప్రిల్ 4న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దీంతో మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు దిల్ రాజు. ఇక నిర్మాతగా తనకి 20 ఏళ్ళు పూర్తి అవ్వడంతో నేడు (ఏప్రిల్ 5) ట్విట్టర్ లో నెటిజెన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు.

Ustaad Bhagat Singh: ఉస్తాద్ కోసం నయా లుక్‌లోకి పవన్.. ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!

ఈ క్రమంలోనే నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ వచ్చాడు. చిరంజీవితో సినిమా ఎప్పుడు ఉండబోతుంది అని ప్రశ్నించగా.. పూనకాలు లోడింగ్ అంటూ చెప్పి త్వరలో అని తెలియజేశాడు. అలాగే బాలకృష్ణతో కూడా ఒక సినిమా చేయాలనీ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ (Prabhas) అన్ని కమిట్‌మెంట్స్ అయ్యిపోయాక మా బ్యానర్ లో ఒక మూవీ చేయబోతున్నట్లు తెలియజేశాడు. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), కేజీఎఫ్ హీరో యశ్ తో (Yash) కూడా తన బ్యానర్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

Pushpa 2 : పుష్ప గ్లింప్స్ లో ఇది గమనించారా.. స్టోరీ ఇదేనా?

ఇక తన డ్రీం ప్రాజెక్ట్ జటాయు గురించి కూడా చెప్పుకొచ్చాడు. బెస్ట్ టెక్నీషియన్స్ తో, బెస్ట్ స్టార్ క్యాస్ట్ తో ఆ సినిమా ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సినిమా ఎవరితో ఉండబోతుంది అనేది మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతం దిల్ రాజు తమ బ్యానర్ లో 50 సినిమాగా రామ్ చరణ్ (Ram Charan) గేమ్ చెంజర్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.