Dil Raju : గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్స్ గురించి నాకేం తెలీదు.. నన్ను అడగకండి..

తాజాగా గాండీవదారి అర్జున ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు పాల్గొనగా ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్ అంటూ అరిచారు.

Dil Raju : గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్స్ గురించి నాకేం తెలీదు.. నన్ను అడగకండి..

Dil Raju Sensational comments on Ram Charan Game Changer Movie Updates

Updated On : August 22, 2023 / 9:07 AM IST

Dil Raju : తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. భారీ వ్యయంతో చాలా మంది స్టార్ కాస్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. శంకర్ సినిమా అంటేనే భారీగా ఉంటుందని తెలిసిందే. ఇప్పుటికే చాలా శాతం షూటింగ్ పూర్తయింది. కానీ శంకర్ ఈ సినిమా ఆపేసి భారతీయుడు 2 సినిమా షూట్ చేసుకుంటున్నాడు. అయితే చరణ్ కి పాప పుట్టడంతో ఫ్యామిలీకి టైం ఇవ్వాలనే ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

కానీ చరణ్ ఫ్యాన్స్ మాత్రం నిర్మాత దిల్ రాజుని గేమ్ ఛేంజర్ అప్డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో దిల్ రాజు పై పోస్టులు పెడుతున్నారు అభిమానులు. హీరోని, డైరెక్టర్ ని కాకుండా నిర్మాతని మాత్రమే సినిమా అప్డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారు చరణ్ అభిమానులు. చరణ్ ఫ్యామిలీకి టైం ఇవ్వాలని కొన్నిరోజులు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చాను అని చెప్పినా అభిమానులు వినట్లేదు.

Nidhhi Agerwal : ప్రభాస్ మారుతి సినిమాలో మరో హీరోయిన్.. నిధి అగార్వల్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందా?

తాజాగా గాండీవదారి అర్జున ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు పాల్గొనగా ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్ అంటూ అరిచారు. దీంతో నిర్మాత దిల్ రాజ్ స్పందిస్తూ.. గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్స్ నా చేతిలో లేవు. అంతా డైరెక్టర్ శంకర్ చేతిలోనే ఉంది. ఆయన్నే అడగండి అని అన్నారు. అయినా అభిమానులు గేమ్ ఛేంజర్ అప్డేట్ అంటూ మళ్ళీ హడావిడి చేస్తూనే ఉన్నారు. వచ్చే సంక్రాంతికి అనౌన్స్ చేసిన ఈ సినిమా సంక్రాంతికి ఉండదని అర్ధమయిపోయింది. శంకర్ భారతీయుడు 2 షూట్ పూర్తి చేసి కానీ గేమ్ ఛేంజర్ కి వచ్చేలా లేడు. మరి మిగిలిన షూట్ ఎప్పుడు మొదలవుతుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో శంకర్ కే తెలియాలి. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, సునీల్, శ్రీకాంత్.. మరింతమంది స్టార్స్ నటిస్తున్నారు. దాదాపు 250 కోట్లతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.