Dil Raju : నెల రోజుల్లో ఇండస్ట్రీని కొత్తగా చూస్తారు.. సినీ సమస్యలపై.. దిల్ రాజు స్పెషల్ ఇంటర్వ్యూ..
గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమకి కష్టాలు ఎదురవుతున్నాయి. టికెట్ రేట్లు పెరగడం, థియేటర్ కి జనాలు రాకపోవడం, ఓ టీటీ లో సినిమా త్వరగా రిలీజ్ అవ్వడం, హీరోల రెమ్యునరేషన్స్...........

Dil Raju
Dil Raju : యువ సామ్రాట్ అక్కికేని నాగ చైతన్య హీరోగా దిల్‌రాజు నిర్మాతగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా థాంక్యూ. ఈ సినిమా జూలై 22న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ సమస్యల గురించి మాట్లాడారు. గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమకి కష్టాలు ఎదురవుతున్నాయి. టికెట్ రేట్లు పెరగడం, థియేటర్ కి జనాలు రాకపోవడం, ఓ టీటీ లో సినిమా త్వరగా రిలీజ్ అవ్వడం, హీరోల రెమ్యునరేషన్స్, హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు ఫ్లాప్ అవ్వడం,మొన్న కార్మికుల సమ్మె.. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఈ సమస్యలపై చర్చలు జరుగుతున్నాయి.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సమస్యలపై దిల్ రాజు మాట్లాడారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ”ప్యాండమిక్ ముందు, ప్యాండమిక్ తర్వాత టోటల్ ఈక్వేషన్స్, మైండ్‌సెట్స్ మారిపోయాయి. అంతకు ముందు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూద్దామనే మూడ్‌లో ఉండేవారు ఆడియన్స్. ప్యాండమిక్‌లో ఇంట్లో కూర్చుని చాలా కంటెంట్ చూశారు. అప్పుడు చాలా ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు వాళ్లకి అంతంతమాత్రం కంటెంట్ నచ్చట్లేదు. దీనికోసం ఇంత డబ్బు పెట్టి వెళ్లాలా? అని అనుకుంటున్నారు. ఈ విషయాల్లో మేం మారాల్సిన టైమ్ వచ్చింది. ఎలాంటి కంటెంట్‌ని ఇస్తున్నాం అనేది మెయిన్ పాయింట్. ఇప్పుడు వచ్చే కథలు సరిపోవడం లేదు. అందుకే ఇప్పుడు మేం హోమ్ వర్క్ ఎక్కువ చేయాలనుకుంటున్నాం.”
”మా మీటింగ్‌లో మేం ప్రధానంగా చూస్తున్నది మేం ఎడ్యుకేట్ కావాలనే విషయాన్నే. నాన్ థియేట్రికల్, థియేట్రికల్ ఎకానమీ మారిపోయింది. వాటి గురించి ఎడ్యుకేట్ కావాలనుకుంటున్నాం. గతంలో జులైలో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్నాయి మనకు. సింహాద్రి, తొలిప్రేమ, ఫిదా వంటి సినిమాలన్నీ జులైలో వచ్చాయి. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ చూస్తారు. మేజర్, విక్రమ్ రెండు సినిమాలు జూన్ ఫస్ట్ వీక్‌లో వచ్చి ఎగ్జయిట్ చేశాయి. ఆడియన్స్ బయటికి వచ్చి బావుందని చెబితే సూపర్‌హిట్ అయ్యాయి ఈ మూవీస్. ఆడియన్స్ ఎప్పుడూ తప్పుకాదు.”
”చేంజింగ్ డైనమిక్స్ వల్ల మా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మారింది. 10 స్క్రిప్టులు, రెండు షూటింగులను ఆపేశాను. నా అడ్వైజ్ ఒక్కటే. ఇప్పుడు సినిమాలు మొదలుపెట్టొద్దు. ఆడియన్స్ మైండ్‌సెట్ మారింది. మనల్ని మనం మార్చుకోవాలి. ముందు ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా మారిందో అర్థం చేసుకోవాలి. టికెట్ రేట్లు డిస్ట్రిబ్యూటర్‌గా నా చేతిలో ఉండదు. అది ప్రొడ్యూసర్ కాల్. నా థాంక్యూ సినిమాని ఇప్పుడు 100 ప్లస్ జీయస్‌టీ ఇస్తున్నాం. మల్టీప్లెక్స్ లో 150 ప్లస్ జీయస్‌టి. ఇందులో 75 మల్టీప్లెక్స్ కి వెళ్తుంది, నాకు 75 వస్తుంది. తెలంగాణలో మినిమమ్ దగ్గర నుంచి మ్యాగ్జిమమ్ వరకు రేట్లు మార్చుకోవచ్చు. కానీ ఆంధ్రాలో 150 ప్లస్ జీయస్‌టీ అని జీవో ఇచ్చారు. ఒకసారి మళ్లీ దాని మీద మేం వర్క్ చేయాలి. దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం.”
Thank You: దిల్ రాజుకు థ్యాంక్యూ చెబుతున్న ఆడియెన్స్.. ఎందుకంటే?
”సినిమా తీయాలనుకున్నప్పుడు కంటెంట్‌ని చెక్ చేసుకోవాలి. మన దగ్గర సక్సెస్ పర్సెంటేజ్ 10 పర్సెంటే. కానీ ఇప్పుడు 3 పర్సెంటే సక్సెస్ అవుతోంది. దేశం మొత్తంకూడా సక్సెస్ రేట్ అలాగే ఉంది. అందరూ కాయిన్ కి ఒక్క సైడ్ ఉండటం వల్ల వచ్చిన నష్టం ఇది. మంచి కంటెంట్ ఇచ్చి రేట్లు తగ్గిస్తే జనాలు వస్తారు. ఓటీటీలో త్వరగా సినిమాలు రావడం వల్ల కూడా థియేటర్లకు జనాలు తగ్గారు. నెల రోజుల్లో ఇండస్ట్రీని అందరూ కొత్తగా చూస్తారు. జనాల్లో స్పెండింగ్ కెపాసిటీ కూడా తగ్గింది. కర్ణుడి చావుకు వంద కారణాలు లాగా సినిమా ఫ్లాప్‌కు చాలా ఇబ్బందులున్నాయి.”
”మిడ్ రేంజ్ నుంచి టాప్ స్టార్‌కి వెళ్లే సినిమాలు థియేటర్లలో వచ్చాకే ఓటీటీకి వెళ్లాలి. అది పది వారాలకా? ఎప్పటికా? అనేది ఆలోచిస్తున్నాం. ఈ విషయంలో నిర్మాతలందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం. నిర్మాతల చేతిలో ఉన్న పనులు చేసుకుంటే, తర్వాత మిగిలిన విషయాలను గురించి మాట్లాడుకోవచ్చు. ఇంతకు ముందు కట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది జరిగినప్పుడు ఆ సమస్య నిర్మాతది మాత్రమే. కానీ ఇప్పుడు సినిమాది. అందుకే అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ప్రతి సినిమాకీ డబ్బు పోతుందని తెలిస్తే బాధ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ విషయం అర్థమైంది. డైరక్టర్లకీ, హీరోలకీ కూడా విషయం అర్థమైంది.”
”ఆడిన సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి? ఆడిన సినిమాలకు ఒరిజినల్ నెంబర్స్ ఏంటి? అని అనుకుంటున్నాం. హిందీ హిట్ సినిమాకి కూడా ఓపెనింగ్ రాదని ముందే అనుకున్నాం. సినిమా బావుందనుకున్నప్పుడు డే బై డే సినిమా బెటర్ అయింది. మన దగ్గర ఫ్రైడే, శనివారం, ఆదివారానికి అన్నీ వెళ్లిపోతున్నాయి. సోమవారానికి ఏమీ ఉండటం లేదు. మంచి సినిమాలకు ఆడియన్స్ ఎప్పుడూ రావడానికి సిద్ధమే. హిట్ సినిమా మామూలు రోజుల్లో రిలీజ్ అయి ఉంటే మినిమమ్ 15 కోట్లు వచ్చేది మొదటి రోజు. కానీ ఇవాళ 6,7కోట్లకు వచ్చాం. నాకు 66 పర్సెంట్ తగ్గింది. మంచి సినిమా తీసినా ఇలా అయితే, ఇప్పుడు నేను డబుల్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎకానమిక్స్, డైమన్షన్స్ మారిపోయాయి. వాటిని అర్థం చేసుకోవాలి.”
Tollywood : షూటింగ్స్ ఆపేస్తారా?? ఈ సారి నిర్మాతల వంతు..
”ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కన్నా, నష్టమే ఉంది. ఓటీటీలో సూపర్‌హిట్ అయినా నాకు వచ్చేదేమీ లేదు. అదే సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే ఆ ఎనర్జీ వేరు. ఆడుతున్నకొద్దీ ఎవ్రీ డే కలెక్షన్లు వింటుంటే నిర్మాతలకు ఎనర్జీ ఇస్తుంది. సినిమా ప్యాషన్‌గా తీయాలనుకున్నవారికి ఎకానమిక్స్ ముఖ్యమే. ఎనర్జీ కూడా ముఖ్యమే. మైనస్‌లు తీసేసి, ప్లస్‌ల వైపు డ్రైవ్ చేయాలి. ప్రొడ్యూసర్ల గురించి హీరోలకు కన్‌సర్న్ ఉంటుంది. వాళ్లకీ అన్నీ తెలుసు. కాబట్టి వాళ్లందరినీ కూర్చోబెట్టి అడ్రస్ చేయాలి. అందరూ అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. సమస్యను అర్థమయ్యేలా చెబితే సరిపోతుందని నా ఫీలింగ్” అని సినిమా సమస్యలపై మాట్లాడారు. త్వరలో నిర్మాతల మండలి మీటింగ్ జరగనుంది.